21మందిని రిజెక్ట్ చేసి.. | Woman File a Case Against Matrimony Website and Demands 70K

             21 మందిలో ఎవడూ నచ్చలేదు.. 70 వేలు వాపస్

             ఒకప్పుడు అంటే పెళ్లి సంబంధాలు అంటే వధూ, వరుల కోసం కాళ్ళు అరిగేలా ఊళ్ళు తిరగాలి. ఇప్పుడో, అంతా ఆన్ లైన్ లోనే. ఫోటో చూసి అందంగా ఉన్నాడో, లేదో చెప్పచ్చు. అతని డీటెయిల్స్ చూసి అర్హుడో కాదు తెలుసుకోవచ్చు.  ఈ మొత్తం జెన్యూన్ రిపోర్ట్స్ ని కొన్ని సంస్థలు తమ మ్యాట్రిమోనీ వెబ్ సైట్స్ లో పెడుతున్నాయి. దీంతో లైఫ్ పార్టనర్ ని వెతుక్కోవడం ఈజీ అయిపోయింది. పది మందిలో ఎందుకు, లక్షల్లో ఒకడు ఎందుకు కాకూడదు అన్నట్టు అమ్మాయిలు కూడా డీప్ ఎనాలసిస్ చేసుకుని మరీ వరుడిని వెతుక్కుంటున్నారు. ఈ ప్రాసెస్ లో కొన్ని సంస్థలు కొన్ని హామీలు ఇస్తున్నాయి. అలా ఓ సంస్థ "నచ్చిన వరుడ్ని చూపిస్తాం మాది హామీ" అని గ్యారంటీ ఇచ్చింది. ఇదే ఇప్పుడు ఆ సంస్థకి చిక్కులు తెచ్చిపెట్టింది. నచ్చిన వరుడిని చూపిస్తామని ఒక సంస్థ ఓ మహిళకు హామీ ఇచ్చింది. కానీ ఆ సంస్థ వెతికి పట్టుకున్న వరుళ్లలో ఏ ఒక్కరూ ఆమెకి నచ్చలేదు. దీంతో ఇచ్చిన హామీని తుంగలో తొక్కారంటూ ఆ సంస్థపై ఫిర్యాదు చేసింది. దీంతో సదరు సంస్థ  యువతికి రూ.70 వేల చెల్లించాల్సి వచ్చింది.

             ఈ ఘటన చండీగఢ్‌ లో చోటు చేసుకుంది. 27 ఏళ్ల యువతి, తనకు వరుడు కావాలని ఓ ప్రైవేటు వెబ్‌ సైట్‌ కి అప్రోచ్ అయ్యింది. దీని కోసం ఆమె 12 నెలల ప్లాన్ రిజిస్టర్ చేసుకుంది. ఇందుకోసం ఆ యువతి 58,650 రూపాయలు చెల్లించింది. దీంతో ఆ సంస్థ ఆమెకు 21 సంబంధాలు చూపించింది. వాటిలో యువతికి ఒక్క సంబంధం కూడా నచ్చకపోవడంతో, సదరు సంస్థపై ఫిర్యాదు చేసింది. అదేవిధంగా తాను చెల్లించిన నగదు తిరిగివ్వాలని ఆ సంస్థ వెబ్‌ సైట్‌ కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. దీంతో సంస్థ యాజమాన్యం అసలు 58,650 రూపాయలతో కలిపి 7వేల రూపాయలు పరిహారం, 5 వేల రూపాయలు కేసుతో కలిపి మొత్తం 70 వేలు యువతికి చెల్లించింది. కాగా సంస్థ నిర్వహించిన మీటింగ్‌లకు యువతి ఏ రోజు రాలేదని ఆ సంస్థ ఆరోపించింది. అంతేకాదు ఆమె తాము కాల్స్ చేసినా, మెసేజ్‌లు చేసిన స్పందించేది కాదని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఎందుకొచ్చిన గొడవలే అని, 12 వేల కోసం ఆలోచిస్తే కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటుందనే కారణంతోనే తమ తప్పు లేకపోయినా ఆమెకి 70 వేలు చెల్లించారట సంస్థ యాజమాన్యం.

Comments