చనిపోయింది అనుకున్న ఈ రిపోర్ట్రర్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే షాక్ |

         పాకిస్తాన్ వాళ్ళు నన్ను చంపేస్తుంటేభారతీయులే నన్ను బతికించారు - పాకిస్తానీ రిపోర్టర

             విషయం పూర్తిగా తెలుసుకోకుండా మిడిమిడి జ్నానంతో ఎవరో రాశారు కదా అని అది నిజమో కాదో ఆలోచించకుండా కాపీ పేస్ట్ లు చేసే మీడియాలు చాలానే ఉన్నాయి. ఏదైనా సమాచారం బయటకి వస్తే చాలు, అది ఫేకో, జెన్యూనో తెలుసుకోకుండానే వైరల్ చేసేస్తున్నారు. మీడియా ఎక్కడున్నా మీడియానే అని నిరూపించారు. తాజాగా ఇలాంటి సంఘటనే పాకిస్తాన్ లో కూడా జరిగింది. బతికున్న అమ్మాయిని చంపేశారు. అది కూడా మీడియాలో పని చేసే అమ్మాయిని. పాకిస్తాన్ కి చెందిన ఇర్జా ఖాన్ అనే మహిళా రిపోర్టర్ ఓ లైవ్ ప్రోగ్రాం కవరేజ్ కోసం ఒక సభకి వెళ్లారు. సభాప్రాంగణం మొత్తం కనిపించడం కోసం క్రేన్ పై కూర్చొని లైవ్ ఇవ్వడం స్టార్ట్ చేసారు. సమాచారం అందిస్తున్న సమయంలో ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారు. దాదాపు పది అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోవడంతో గాయాలయ్యాయి. దీంతో, ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమె హాస్పిటల్ నుంచి ఇంటికి రావడం, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడం, వేరే ఛానల్ లో జాయిన్ అవ్వడం జరిగిపోయాయి. ఇది జరిగి ఏడాది పైనే అవుతుంది. ఐతే, "లైవ్ లో న్యూస్ చదువుతూ చనిపోయిన మహిళా రిపోర్టర్" అంటూ ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అయ్యింది.

            న్యూస్ చదువుతూ క్రేన్ పై నుంచి పడి చనిపోయిందని క్లిప్పింగ్ ని ఎడిట్ చేసి నెట్ లో పెట్టారు. దీంతో అది కాస్తా అన్ని దేశాలకీ స్ప్రెడ్ అయ్యింది. నిజమే అనుకుని ఎక్కడెక్కడో ఉన్న మీడియా మిత్రులు కూడా ఆమెకి సానుభూతి తెలిపారు. ఆ ఛానల్ లో పనిచేసే ఉద్యోగులే డబ్బు కోసం ఇలా ఆమెని చంపేశారని, ఐతే భారతీయులే తనని బతికించారని ఆమె తెలిపారు. ఒకరోజు ఆమెకి ఓ కాల్ వచ్చిందట. లిఫ్ట్ చేసి "దిస్ ఈస్ ఇర్జా ఖాన్, హూ ఈస్ దిస్" అన్నారట. దానికి ఆమె టీచర్ మాట్లాడుతూ "నేనమ్మా మీ టీచర్ ని, అదేంటి నువ్వు బతికే ఉన్నావా? నువ్వు చనిపోయావని వార్తలు వస్తున్నాయే. నేనింకా నీ కుటుంబానికి సంతాపం తెలియజేద్దామని కాల్ చేశా, sorry అమ్మ" అని అన్నారట. ఆ రిపోర్టర్ ఆశ్చర్యపోయి, ఏం జరిగిందని అడిగారాట. దానికి ఆ మేడమ్, "నువ్వు చనిపోయావని ఓ వీడియో బాగా వైరల్ అయ్యింది. అది నిజం అనుకున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆ రిపోర్టర్ ట్విట్టర్ లో లైవ్ ఇస్తూ " నేను న్యూస్ చదువుతూ క్రేన్ పై నుంచి పడిపోయిన వాస్తవమే. అప్పటి వరకూ తీవ్రమైన ఎండలో తిరగడం వల్ల స్పృహ కోల్పోయానని, పైనుంచి పడటం వల్ల నడుముకు గాయమైందని, అంతకు మించి నాకు ఏమీ కాలేదని" ఆమె తెలిపారు.

            "నేను చనిపోయాననుకుని కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అది నిజం అనుకుని నా స్నేహితులు మా కుటుంబసభ్యులకి కాల్ చేసి సంతాపం తెలియజేస్తున్నారు. నేను లైవ్ లోకి వచ్చాను కదా, ఇప్పటికైనా ఆ పోస్ట్ లని డిలీట్ చేయండి ప్లీజ్" అంటూ ఆమె మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ తాను చనిపోయిందన్న వార్తలు పాకిస్తాన్ మీడియాలో ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు. ఐతే, "ఇండియాలో మాత్రం తాను బతికే ఉన్నాననే వార్తలు టి‌విల్లో రావడం సంతోషం కలిగిస్తుందని, భారతీయ ప్రజలు తనపై ఎంతో ప్రేమ చూపించారని" ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె భారతీయులందరికీ ధన్యవాదాలు తెలిపారు. సొంత దేశం వాళ్ళే తమ ఛానల్స్ రేటింగ్స్ కోసమో, డబ్బు కోసమో బతికున్న వాళ్ళని చంపేస్తే, విషయం తెలిసిన వెంటనే ఆమె బతికుందన్న వార్తలు టెలికాస్ట్ చేసి భారతదేశ గొప్పతనాన్ని చాటారు. ఇలాంటి మీడియా సంస్థలు ఉన్నాయ్ కాబట్టే ఇంకా భారతదేశం ఇతర దేశాల దృష్టిలో గొప్పగా కనబడుతుంది. లేదంటే ప్రస్తుతం ఉన్న మీడియా ఛానల్స్ చేసే చిల్లర పనుల వల్ల ఎప్పుడో పడిపోయేది. ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉండటంతో పాటు న్యూస్ యాంకర్‌ గా వార్తలు చదువుతున్నారు. 

Comments