అమెరికాలో ఉన్నారా..?|Are You Staying In United States?Especially This Video For You

           అమెరికా లో స్టూడెంట్ వీసా తీసుకోవడానికి..కరెక్ట్ ప్రాసెస్

           అమెరికా వెళ్ళడానికి అందరూ కలలు  కంటుంటారు...అక్కడికి వెళ్లి చదువుకొని తిరిగి ఇండియాకి వచ్చి మంచి జాబ్ లో సెటిల్ అవ్వాలని, కొందరు అనుకుంటే, అమెరికాలో నే సెటిల్ అవ్వాలని మరికొందరు అనుకుంటారు...అయితే అమెరికాకి వెళ్ళాలంటే ముందు వీసా కంపల్సరీ అని అందరికి తెలిసిన విషయమే..అందులో అక్కడికి వెళ్లి పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదువుకోవాలనుకునే వారికీ వీసా ఎంత ముఖ్యమైందో తెలిసిందే...కానీ చాల మంది వీసా తీసుకునే ప్రాసెస్ లోబ్రోకర్స్ ని నమ్మి మోసపోతుంటారు...స్టూడెంట్స్ వీసా ని ఎలా తీసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఏమేం చేయాలి అనే విషయాలు ఎవరికీ తెలియవు...ఇపుడు ప్రాసెస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం....

          అమెరికా లో మీరు  అప్లై చేసుకున్న యూనివర్సిటీమీ అప్లికేషన్ ను చెక్ చేసిన తరువాత మీ సీట్ ని కన్ఫర్మ్ చేస్తూ Form I-20 సెండ్ చేస్తుంది. అపుడు మీరు Form I-20చెక్ చేసుకోవాలి... మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, లాంటి అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా? స్పెల్లింగ్స్ సరిగ్గా ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోవాలి.... తర్వాత ఆన్లైన్ లో I-901 ఫాంను ఆన్లైన్లో పూర్తి చేసి ఫీజు పే చేయాలి...ఫీజు కట్టిన తర్వాత తర్వాత I-901 రిసీట్ తీసుకోవాలి. తర్వాత యూఎస్ఎంబసీ లేదా కాన్సులేట్లలో ఎఫ్-1 స్టూడెంట్ వీసా కోసం అప్లై చేయోచ్చు. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయిన్ ఏంటంటే, అక్రిడెటెడ్ యూఎస్ యూనివర్సిటీలన్నీ యూఎస్ హోంలాండ్ సెక్యూరిటీకి ఫాం I-17లను అందజేస్తాయి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తమ వర్సిటీలో చేరుతున్నారని చెప్తుంది. ఫాం I-17ను మీ యూనివర్సిటీ అందజేసిందో లేదో  కన్ఫర్మ్ చేసుకోవాలి....కనీసం అమెరికాలో ఉండేందుకు ఆరు నెలల వ్యాలిడిటీతో ఉండాలి. నాన్ ఇమ్మిగ్రేషన్ వీసా అప్లికేషన్ ఫాం DS-160 ఆన్లైన్ పూర్తి చేయాలి.

          కనీసం అమెరికాలో ఉండేందుకు ఆరు నెలల వ్యాలిడిటీతో ఉండాలి..దానికోసం నాన్ ఇమ్మిగ్రేషన్ వీసా అప్లికేషన్ ఫాం DS-160 ఆన్లైన్ లో ఫిల్ చేయాల్సి ఉంటుంది...  అప్లికేషన్ ఫీ పేమెంట్ రిసీట్స్  ఇంటర్వ్యూకీ ముందే ఫీజు పే చేయాల్సి ఉంటుంది.   DS-160 Form ఆన్లైన్ లో పూర్తి చేసే సమయంలోనే ఫొటో కూడా అప్ లోడ్ చేయాలి. సెర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటి ఫర్ ఎఫ్-1 స్టూడెంట్ వీసా: ఫాం -20ని మీ యూనివర్సిటీ నుంచి పొందాల్సి ఉంటుంది. ట్రాన్స్క్రిప్స్, డిగ్రీలు, లేదా మీరు పొందిన ఇనిస్టిట్యూషన్ల సర్టిఫికేట్లు. మీ యూనివర్సిటీకి స్టాండర్డైజ్డ్ టెస్ట్ స్కోర్లు అవసరమవుతాయి. మీరు యూఎస్లో చదువు పూర్తి చేసిన తర్వాత దేశాన్నివదిలి రావాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్, లివింగ్, ట్రావెల్ ఖర్చులు చెల్లించేందుకు మన దగ్గర ఇన్కం సోర్స్ డీటెయిల్స్ ని కూడా ముందే చెప్పాల్సి ఉంటుంది.....చివరికి కౌన్సులర్ అధికారి మీ డాక్యుమెంట్లను చెక్ చేస్తారు... ఎఫ్-1 వీసాకు మీరు అర్హులా కాదా? అనే విషయాన్ని తేలుస్తాడు

           మొత్తానికి అమెరికాలో స్టూడెంట్ గా ఎంటర్ అవ్వాలంటే, మీ దగ్గరపాస్పోర్ట్, స్టూడెంట్(ఎఫ్-1) వీసా వ్యాలిడై ఉండాలి. మీరు మినిమం ఆరు నెలలైనా ఉండాలి... వీసాపై యూనివర్సిటీ పేరు సరిగా ఉండాలి. మొదటిసారి అమెరికా వెళ్లే స్టూడెంట్స్  మీరు యూనివర్సిటీలో జాయిన్ అయ్యే టైం కన్నా 30 రోజుల ముందుగా వెళ్లే ఛాన్స్ ఉంటుంది. మన దేశంలోని ఎంబసీ నుంచి స్టూడెంట్ వీసాను సీల్డ్ కవర్లో అందజేస్తారు. అది ఓపెన్ చేయకుండానే అమెరికాలో ప్రవేశించేప్పుడు అక్కడి విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులకు అందించాలి.

           అమెరికా లో మీరు అడుగు పెట్టిన తరువాత, మీతో ఉండాల్సిన డాక్యుమెంట్లు: 1 Passport (including the sealed envelope) with Student (F-1 Visa).2, Form I-20 / DS-2019. Form I-797 - Receipt Notice verifying Fee payment.3 Evidence of financial resources while study in USA. 4,Tuition receipts (if applicable).5Educational transcripts.6 Name and c(DSO) or Responsible Officer (RO) at your intended University.

         ఇక ఒక్కసారి అమెరికాలో అడుగుపెట్టాక సోషల్ సెక్యూరిటీ నెంబర్ కోసం అప్లై  చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే డ్రైవర్స్ లైసెన్స్ కూడా తీసుకోవాలి. అమెరికాలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు, మీరు క్యాంపస్ బయట జాబ్స్ చేయకూడదు.. యూనివర్సిటీలోనే వారానికి 20గంటలకు మించని ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చుఅమెరికాలో స్టడీ పూర్తి చేసిన తర్వాత 60రోజులపాటు అక్కడే ఉండేందుకు అనుమతి ఉంటుందిఅమెరికాలో అడుగుపెట్టిన తర్వాత ఎయిర్పోర్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. అయితే వారితోఆఫ్ క్యాంపస్ జాబ్ చేస్తూ చదువుకుంటానని మాత్రం అక్కడ చెప్పొద్దు. సో ఫ్రెండ్స్  స్టూడెంట్ వీసా ఎలా తీసుకోవాలో తెలుసుకున్నారుగా ఇక మీదట రూల్స్ నే ఫాలో అయిపోండి, మధ్యలో బ్రోకర్స్ ని నమ్ముకోకండి మోసపోకండి డబ్బులు ఎవరికైనా ఊరికే రావు...ఇక మోసపోయింది చాలు....

Comments