ఆధార్ పై సుప్రీమ్ కోర్ట్ సంచలన నిర్ణయం What Supreme Court Said About AADHAR & Where It Is Mandatory

         ఆధార్ పై సుప్రీమ్ కోర్ట్ సంచలన నిర్ణయం

               ప్రతి చోట ఆధార్ తప్పనిసరి కాదు అని సుప్రీంకోర్టు  తిర్పచింది. అలాగే ప్రైవేట్ సంస్థలు ఆధార్ ను అడగవద్దు అని సుప్రీంకోర్టు  తిర్పచింది. ఆధార్ దేనికి అవసరం దేనికి అవసరం లేదు అని సుప్రీంకోర్టు తిర్పచింది. అసలు వివర్లో కి వెళ్తే  ఆధార్ కు చట్టబద్ధత వున్నఇది అన్ని చోట్ల తప్పని సరి కాదు అని  సుప్రీంకోర్టు  తిర్పచింది.ఏది విశిష్టకార్డ్ అని  అంగీకరిస్తూనే ఇతర ధ్రువీకరణ కార్డు లాగానే పరిగణిస్తాము అని చెపింది. ఆధార్ చట్టబద్ధమే కాని, తప్పనిసరి కాదు అంటూ సుప్రీమ్ కోర్టు సంచలనం తీర్పునిచ్చింది. బ్యాంకు ఖాతాకు ఆధార్ తప్పనిసారేమీ కాదని వ్యాఖ్యానించింది. మొబైల్ నంబర్ కుఆధార్ అనుసంధానించాల్సిన పని లేదు... ఆధార్ ఉంటేనే స్కూల్ లో చేర్చుకుంటామంటే కుదరదు అని స్పష్టం చేసింది. బుధవారం ఐదుగురు అత్యున్నత సీనియర్‌ న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం దీనిపై తీర్పును వెల్లడించింది.

            ఆధార్ చట్టంలో కొన్ని సవరణలు చేయాలని ధర్మాసనం సూచించింది. ఆధార్ చట్టం సెక్షన్ 57, సెక్షన్ 33(2)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆధార్ ఇవ్వాలని ప్రైవేట్ సంస్థలు డిమాండ్ చేయరాదని... పాన్ కార్డు, ఐటీ రిటర్న్స్ కు మాత్రం ఆధార్ తప్పనిసరి అని పేర్కొంది సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం. ఆధార్ భద్రతపై స్పందించిన ధర్మాసనం... ఆధార్ కార్డుకు డూప్లికేట్ తయారు చేసే అవకాశమే లేదని స్పష్టం చేసింది. ఆధార్ సేకరించేది చాలా తక్కువ వ్యక్తిగత సమాచారమని, ఆధార్ నమోదు ప్రక్రియలోపరహితంగా ఉందని తెలిపింది. బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ కనెక్షన్లకు ఆధార్ తప్పనిసరి కాదని వెల్లడించింది. అట్టడుగు వర్గాల వారికి ఆధార్ సాధికారత కల్పించింది... ఆధార్ విషయంలో ఉన్న ఒకే ఒక్క సవాల్ గోప్యత అని న్యాయస్థానం పేర్కొంది. అక్షరాస్యత మనిషిని వేలిముద్ర నుంచి సంతకం వరకు తీసుకెళితే... టెక్నాలజీ మళ్లీ సంతకం నుంచి వేలిముద్ర వైపు తీసుకొచ్చిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గోప్యత విషయంలో ఆధార్ కు సరిపడినంత భద్రత ఉంది... బయోమెట్రిక్ వివరాల ఆధారంగా కొత్తగా ప్రొఫైల్ తయారీ అసాధ్యం అని ధర్మాసనం తెలిపింది. సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారులు మాత్రమే సమాచారం పంచుకొనే విషయంపై నిర్ణయం తీసుకోవాలి అని సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం పేర్కొంది. ముఖ్యగా ఆధార్ దేనికి అవసరం దేనికి అవసరం లేదో తేల్చిచేపింది సుప్రీంకోర్టు పాన్ కార్డు, ఐటీ రిటర్న్స్ కు మాత్రం ఆధార్ తప్పనిసరి అని పేర్కొంది. బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ కనెక్షన్లకు ఆధార్ తప్పనిసరి కాదని వెల్లడించింది.ఆధార్ ఉంటేనే స్కూల్ లో చేర్చుకుంటామంటే కుదరదు అని స్పష్టం చేసింది. స్కూల్ లో అవసరం లేదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Comments