4 నెలలుగా ఒకే కల.. పొలంతవ్వి చూస్తే దుర్గమ్మ విగ్రహం | Goddess Durga Statue Found In Farm

         4నెలలుగా  మహిళకు కల... పొలంలో తవ్విచూస్తే బయటపడ్డ దుర్గమ్మ విగ్రహం!

            మనిషికి వచ్చే కలలు నిజం అవుతాయా...? ఎదో ఒకటో రెండో అవ్వొచ్చు!! కానీ ఒక్కోసారి   కలలో దేవుడు కనిపిస్తే...ఇలా చేయమని చెప్పాడు అని ఎవరికైనా చెప్తే, అందరూ పిచ్చివాడి కింద జమ కట్టి పక్కన పడేస్తారు...కానీ అవి ఎంతవరకు నిజం అని ఎవరూ పట్టించుకోరు.....ఆనాడు అడవిలో దమ్మక్కకి రాముడు తాను పుట్టలో ఉన్నానని చెప్పాడు, అలాగే గోల్కొండ తానీషా కలలో రాముడు కనిపించి డబ్బు ఇచ్చాడని మనం చదువుకున్నాం...తరువాత చిలుకూరు బాలాజీ కలలో కనిపించి తాను అక్కడ ఉన్నానని చెప్పాడు...వెళ్లి చూస్తే అక్కడ బాలాజీ విగ్రహం ఉంది....ఇక ఇపుడు అలాంటిదే మరో సంఘటన జరిగింది.....

            సాక్షాత్తు దైవమె మమ్మల్ని చల్లగా చూడడానికి వచ్చింది అని పూజలు చేస్తున్నారు.... వూరి ప్రజలు..ఇంతకీ ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? పూర్తి వివరాలలోకి వెళితే....ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఘటన జరిగింది. ఇక్కడికి సమీపంలోని జాన్బాద్తండాలో ఎన్నో ఏళ్ల నుండి  ఏనుగుల ఉపేంద్రమ్మ అనే మహిళ ఒంటరిగా నివాసం ఉంటోంది....తాను అమ్మవారికి దైవ భక్తురాలు....ఎదుటి వారికి ఏదైనా కష్టం వస్తే కష్టాలు తీరేల ఎదో ఒక పరిష్కారం చెప్తూ ఉండేది....ఉన్నట్టుండి  గత నాలుగు నెలలుగా బానోతు వెంకన్న అనే వ్యక్తికి చెందిన పొలంలో దుర్గామాత విగ్రహం ఉందని, అమ్మవారు అక్కడ  కొలువై ఉన్నట్టు కలలు వచ్చాయి...ఇది అతనికి చెప్తే పట్టించుకోలేదు....వేరే ఎవరికి చెప్పినా లాభం లేకపోయింది...ఎంత చెప్పినా వినకపోవడంతో, రోజు ఆపుకోలేక  ఎలాగైనా పొలంలో తవ్వి చూడండి అని అందరిని తీసుకెళ్ళింది....

           అందరి ముందు తవ్వడానికి వెంకన్న  ఒప్పుకున్నాడు...మనుషులను పెట్టి తవ్వించాడు....ఆమె అన్నట్టుగానే తవ్వకాల్లో దుర్గామాత విగ్రహం బయటపడింది. దీంతో దుర్గమ్మ తమను ఆదుకునేందుకు స్వయంభువుగా వెలిసిందని ప్రజలు ప్రత్యేక పూజలు చేయడం ప్రారంభించారు. ఇక్కడ గుడి కడతామని వారు స్పష్టం చేశారు.ఇక పెద్దఎత్తున భక్తులు వస్తుండటంతో, విషయం తెలుసుకున్న పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేసి, పురావస్తు అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా, ప్రాంతంలో గతంలో శివాలయం ఉండేదని ఇక్కడి వారు అంటున్నారు. ఉపెంద్రమ్మ ను ఇపుడు అందరూ దైవ సమానురాలిగా చూస్తున్నారు...తమ కష్టాలు తీర్చడానికి అమ్మవారే మా వద్దకు పంపిందని అంటున్నారు ఊరి ప్రజలు....అంతే కాకుండా మరి కొద్ది రోజుల్లో  దుర్గాష్టమి రాబోతోంది....విగ్రహాన్ని ప్రతిష్ట చేయడానికి మంచి ముహూర్తం కూడా ఉంది....స్వయంగా అమ్మవారే ముహూర్తానికి వచ్చింది అని ఊరి ప్రజలు అనుకుంటున్నారు....

నిజానికి మనిషికి, కలలకు విదదీయరాని బంధం ఉంది..మనిషికి వచ్చే కలల మీద నేటికీ రీసర్చ్ జరుగుతూనే ఉంది...

          రాత్రిపూట కలలో ఏమైనా వస్తే ఎన్నో అనుమానాలు వస్తుంటాయి. ఇలా కల రావడం మంచిదేనా లేక చెడ్డదా అని ఆలోచిస్తూ ఉంటారు. లేక పెద్దవారిని అడుగుతుంటారు. రాత్రిపూట స్వప్నంలో దేవతలు కనిపిస్తే చాలా మంచిది.అలాగే రాక్షసులు, దెయ్యాలు, ఘోరమైన సంఘటనలు  కనిపిస్తే చాలా దోషం. దేవుళ్ళు కనిపిస్తే మాత్రం దైవానుగ్రహం మనపై ఉందనిమనం తెలుసుకోనుటకై మనకు వాళ్ళు కలలో కనిపిస్తారు. అలా దేవుళ్ళు మనకు కలలో కనిపిస్తే, మనం భక్తి శ్రద్దలతో పూజిస్తే దైవానుగ్రహం కలిగి మనం ఏమైనా కోరికలు కోరుకుంటే వెంటనే నెరవేరుతాయి. కాబాట్టి కలలు అని లైట్ తీసుకోకండి....ఎవరినా నమ్మలేని నిజాలు కలలో కనపడ్డాయి అని చెప్పినపుడు ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేయండి...కలలు నిజం కూడా కావచ్చు....

Comments