SBI ఎకౌంట్ ఉందా? తస్మాత్ జాగ్రత్త | Do You Have SBI Account? | Beware Of Bank Accounts

          sbiహోల్డర్స్ జాగ్రత్తలు తెలుసుకోకపోతే ....బ్యాంకులో మీ డబ్బు క్షణాల్లో మాయం..

        సంపాదించిన సొమ్మును బ్యాంకులో దాచుకుంటే అవసరానికి పనికి వస్తుందిలే అని అనుకునే వారు ఒకప్పుడు, కానీ ఇపుడు అభిప్రాయం మారుతోంది...బ్యాంకుల పై కూడా నమ్మకం సన్నగిల్లుతోంది వినియోగదారులకు....క్రెడిట్ డెబిట్ కార్డులను వాడుకోవడానికి అదనపు చార్జీలు వసూలు చేయడం, లిమిట్ గా వాడుకోవడం, ట్రాన్సాక్షన్ లకు అదనంగా కట్ చేయడం లాంటి పనులఫై అకౌంట్ హోల్డర్స్ పెదవి విరుస్తున్నారు...బ్యాంకు అధికారులు పెడుతున్న రూల్స్ కే భయపడుతోంటే, కొత్తగా హ్యాకింగ్ పేరుతో అకౌంట్ లో ఉన్న డబ్బంతా ఊడ్చుకెళ్ళిపోతున్నారు ... హ్యాకింగ్ దొంగలు.. దొంగలు కూడా అప్డేట్ అయ్యారు...atm దగ్గర కాపుకాచి డబ్బు దొంగిలిచే రోజులు పోయాయి..ఇపుడు నేరుగా atm లలోనే ఏవేవో కార్డులు పెట్టీ, వాటి డూప్లికేట్ లను తాయారు చేసి..డబ్బంతా స్వాహా చేస్తున్నారు....ఈరోజుల్లో ఆన్లైన్ మోసాలు వందలలో జరిగిపోతున్నాయి..కన్ను మూసి తెరిచే లోపు డబ్బంతా ట్రాన్స్ ఫర్ అయిపోతోంది....

           మరోవైపు బ్యాంకు అధికారులు ఇలాంటి దోపిడీలకు చెక్ పెట్టేందుకు అకౌంట్ హోల్డర్స్ కికొన్ని సూచనలు, రూల్స్ ని చెప్పుకొస్తుంది...తాజాగా మరిన్ని కొత్తసూచనలు చేసింది జాతీయ బ్యాంకు  sbi..sbi తన  ట్విట్టర్ అకౌంట్ ద్వారా   జాగ్రత్తలు సూచించింది.

            అనవసరంగా తెలియని వ్యక్తులతో సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకోవద్దు. దానివల్ల డబ్బు, సమయం వృధా అవుతుందివెరిఫైడ్ అకౌంట్లు, అఫీషియల్ హ్యాండిల్స్నే అనుసరించాలిమీ దగ్గర డబ్బు ఎంత ఉంది అనే విషయాల గురించి ఎవరితోనూ చర్చించవద్దు. వాటిని ఎప్పుడూ రహస్యంగా ఉంచాలిసోషల్ మీడియా సైట్లలో ఫేక్ అకౌంట్స్ని అస్సలు పట్టించుకోవద్దు. వెరిఫైడ్ అంకౌట్లనుబ్లూ రైట్ టిక్చూసి గుర్తించొచ్చు.వెరిఫైడ్ అకౌంట్లను తప్పించి మిగతా అకౌంట్లను నమ్మినా, పరిచయం పెంచుకున్నా మోసానికి గురికాక తప్పదుమీకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు ఏవీ కూడా -మెయిల్లో ఉంచొద్దు. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు లాంటివి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయవద్దు. ఖాతాకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే.. ముందు బ్యాంకుకు కాల్ చేసి సరైన -మెయిల్ ఐడీ తీసుకున్న తరువాతనే మీ సమస్యలను మెయిల్లో పెట్టండి..

           మీరు ఎస్బీఐ వెబ్ సైట్ గాని మిగతా వెబ్ సైట్స్లో కానీ మీ డేటా అడిగినప్పుడు కంపెనీ యూఆర్ఎల్ httpsతో మొదలుకాని వెబ్సైట్లలో మీ కార్డు వివరాలు ఇవ్వకూడదు. అవి ఏవీ సురక్షితం కావు. పై జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా పాటించండి. అప్పుడైతేనే మీ కష్టం వృధా కాదు. మీ డబ్బు సురక్షితంగా ఉంటుందని ట్విట్టర్ ద్వారా ఖాతాదారులకు సూచనలు జారీ చేసింది ఎస్బీఐ. ఇకనుండి అయినా జాగ్రత్తలు పాటిస్తే ఆన్లైన్ మోసాలకు దూరంగా ఉండొచ్చు..ఫ్రెండే కదాని డీటెయిల్స్ చెప్తే అసలుకే మోసం వస్తుంది....గతంలో భార్య అకౌంట్ భర్త ఉపయోగిస్తే ఎలాంటి సంఘటన జరిగిందో అందరికి తెలిసిందే...ఒకప్పుడు ఇంటికన్నా గుడి పదిలం అనేది నాటి మాట, బ్యాంకుల కన్నా కార్డులు పదిలం అనేది నేటి మాట....మీరు కూడా మీ డీటేయిల్స్ ని ఎవరితో చెప్పకండి...మీ డబ్బును వృధా చేసుకోకండి..ఎందుకంటే డబ్బులు ఎవరికీ ఊరికే రావు...

Comments