మోడీ సంచలనం ఈ 5 బ్యాంక్ లు SBI లోకి షిఫ్ట్ | Modi Mege This 5 Banks into SBI

        త్వరలో 5 బ్యాంకులు sbi లోకి.....

           తాజాగా బ్యాంకింగ్ రంగంలో మరో చారిత్రక అడుగు వేసింది భారత ప్రభుత్వం...ఇప్పటికే sbhబ్యాంక్ ని sbi లో కలిపినా సంగతి తెలిసిందే...ఇక ఇపుడు మరో 5 అండర్ గవర్నమెంట్ బ్యాంకులను sbi లో కలిపుతామని నిర్ణయించింది.... మేరకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తద్వారా దేశంలో అతిభారీ బ్యాంకు ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో భారతీయ మహిళా బ్యాంకు విలీనంపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ‘ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనానికి సూత్రప్రాయ ఆమోదాన్ని కేబినెట్ఇదివరకే తెలిపింది. ఆయా బ్యాంకుల పాలకమండళ్ల నుంచి కూడా దీనికి ఆమోదం లభించింది. 

        వాటి సిఫార్సులను కేబినెట్లో పరిశీలించి, ప్రతిపాదనకు ఆమోదం తెలిపాం, అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ విలేకరులకు తెలిపారు. స్టేట్బ్యాంక్ఆఫ్హైదరాబాద్‌ , స్టేట్బ్యాంక్ఆఫ్బికనీర్అండ్జైపుర్స్టేట్బ్యాంక్ఆఫ్మైసూర్‌, స్టేట్బ్యాంక్ఆఫ్ట్రావెన్కోర్‌ (ఎస్బీటీ), స్టేట్బ్యాంక్ఆఫ్పాటియాలా లు ఎస్బీఐలో విలీనం కానున్నాయని చెప్పారు. విలీనం తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా ఎస్బీఐ అవతరిస్తుందని వివరించారు.

       విలీనం వల్ల సమర్థత గణనీయంగా పెరుగుతుందనీ, కార్యకలాపాల వ్యయం తగ్గుతుందనీ చెప్పారు. తొలి ఏడాదే రూ.1000 కోట్ల వరకు ఆదా అవుతుందన్నారు. భారతీయ మహిళా బ్యాంకును ఎస్బీఐలో విలీనం చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందనీ, దానిపై కేబినెట్భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ వివరించారు. విలీనం అమల్లోకి వచ్చే తేదీని తర్వాత ప్రకటిస్తామన్నారు. విలీన నిర్ణయం వల్ల ఒక్క ఉద్యోగి సేవలకీ హాని కలగదనీ, అంతా సజావుగా జరుగుతుందనీ చెప్పారు. భారతీయ స్టేట్బ్యాంక్చట్టం-1959ను, స్టేట్బ్యాంక్ఆఫ్హైదరాబాద్చట్టం-1956ను రద్దు చేయడానికి ఉద్దేశించిన బిల్లునూ కేబినెట్ఆమోదించింది.విలీనం తర్వాత ఎస్బీఐ ఆస్తుల విలువ రూ.37 లక్షల కోట్లకు చేరుతుంది. ఖాతాదారుల సంఖ్య 50 కోట్లు దాటుతుంది. 22,500 శాఖలు, 58 వేల ఏటీఎంలు ఉంటాయి. ప్రస్తుతం ఒక్క ఎస్బీఐకే 16,500 శాఖలున్నాయి. 36 దేశాల్లో 191 విదేశీ కార్యాలయాలూ ఉన్నాయి. 2008లో మొదటిగా స్టేట్బ్యాంక్ఆఫ్     సౌరాష్ట్రను ఎస్బీఐ విలీనం చేసుకొంది. రెండేళ్ల తర్వాత స్టేట్బ్యాంక్ఆఫ్ఇండోర్విలీనమయింది.

           మొత్తానికి అన్ని బ్యాంకులు ఏకమైతే..దేశ ఆర్దిక వ్యవస్థ మరింత మెరుగు పడుతుంది...

Comments