అమృతకి తిరుగులేని వరం ఇచ్చిన KCR.. ఏమిటో తెలుసా? | Telangana CM KCR Gave Gift To Amrutha |

        అమృతకి తిరుగులేని వరం ఇచ్చిన KCR.. ఏమిటో తెలుసా?

             ఇటీవల హత్యకు గురైన ప్రణయ్ సతీమణి అమృత, అతని తల్లిదండ్రులను పలువురు నేతలు పరామర్శిస్తున్నారు. ఆపద్ధర్మ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గురువారం మిర్యాలగూడలోని ముత్తిరెడ్డికుంటలో ప్రణయ్ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంతరం అమృత, ప్రణయ్ తల్లిదండ్రులు బాలస్వామి, ప్రేమలత, సోదరుడు అజయ్‌లను పరామర్శించారు.

         ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రణయ్‌ హత్య దురదృష్టకరమని, అత్యంత హేయనీయమైన ఈ ఘటనను ప్రభుత్వం ఖండిస్తుందని చెప్పారు. అనాగరికమైన పని చేసి పరువు పోగొట్టుకున్నారన్నారు. అమృతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ప్రణయ్‌ ఘటన జరిగిన వెంటనే నిందితులను కఠినంగా శిక్షించేలా కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించామన్నారు.

            అమృతకు రూ.8.25 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఇందులో భాగంగా రూ.4.12 లక్షల చెక్కు జగదీశ్వర్ రెడ్డి అందించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ నుంచి అమృతకు వ్యవసాయ భూమి, రెండు పడకల ఇళ్లు, ప్రభుత్వ ఉద్యోగం అందిస్తామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ వారిని పరామర్శించిన అనంతరం, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమృతకు రూ.1కోటి ఇస్తామని చెప్పారు. ఇప్పటికే తమ్మినేని ఆమె వయస్సు గురించి కూడా ఆలోచించకుండా ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామని ప్రకటించారు.
 

Comments