15ఏళ్ళు పైబడిన ప్రతి అమ్మాయి తప్పక చూడాల్సిన వీడియో| Govt Schemes Latest Updates

           15ఏళ్ళు పైబడిన ప్రతి అమ్మాయి తప్పక చూడాల్సిన వీడియో

          ప్రతి ఇంట్లో పెద్దలు తమ పిల్లలను బాగా చదివించి, మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కోరుకుంటుటారు. కొంతమంది అదృష్ట వంతులకు మంచి ఉద్యోగాలు వచ్చి మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా జీవిస్తుంటారు. మరి కొంతమందికి ఎంతో బాగా చదివి మంచి ర్యంకులు తెచ్చుకున్న సరైన ఉద్యోగాలు రాక భాదపడుతూ ఉంటారు. మంచి ఉద్యోగాలు వచ్చి, జీవితంలో స్థిరపడిన తమ పిల్లలను చూసి మురిసిపోతూ ఉంట్టారు కొంతమంది పెద్దలు. ఒక వైపు ఎంత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఉద్యోగాలు రాక తమ పిల్లల జీవితం ఏమైపోతుందో అని భాద పడే పెద్దలు కొందరు. సరి అయినా అవకాశాల కోసం పిల్లలు, తల్లి,తండ్రులు పేపర్స్ , వెబ్ సైట్స్, ఇంటర్నెట్ లలో వచ్చే మోసపూరిత ప్రకటనలను చూసి మోసపోవటం మనం చాల సార్లు చూసాము. ప్రజలు సరై అయినా అవకాశాలు లేక మోసపోయి ఎవ్వరు బాధ పడకూడదని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజలకు సరి అయినా చదువు, ఉద్యోగం, ప్రతి కుటుంబానికి ఒక సొంత ఇల్లు ఉండాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ప్రజలకు తాము ఇంకా చేస్తున్న సహాయక పనులు తెలియ చెయ్యటం కోసం ప్రభుత్వాలు కొన్ని వెబ్ సైట్స్ కూడా మొదలుపెట్టాయి, వాటిలో తాము ప్రజలకు ముందు, ముందు పిల్లల చదువులో కానీ, పిల్లల ఉద్యోగ విషయంలో కానీ, ప్రజల కు నివాసం కల్పించే విషయంలో కానీ తాము ఏవిందంగా సహాయ పడతామో అని వివరంగా తెలియ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వాలు తమ వెబ్ సైట్స్ లో ప్రకటిస్తున్న

             ప్రకటనలను కొంతమంది మోసగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకొని ప్రభుత్వాన్ని, ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వ వెబ్ సైట్స్ కు దగ్గరగా ఉండే డూప్లికేట్ వెబ్ సైట్స్ క్రియేట్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు మోసగాళ్లు. ప్రభుత్వాలు ఇచ్చిన ప్రకటనలను మోసగాళ్లు ఎలా క్యాష్ చేసుకుంటున్నారో ఇప్పుడు మీకు తెలియచేస్తాను. భారత ప్రభుత్వపు అఫీషియల్ వెబ్ సైట్ అయినా www . sagaramala . gov . in అనే సైట్ లో ప్రజలకు నివాసం యోగ్యం కోసం 12 లక్షల కోట్లు విలువ చేసే నివాస్ యోజన, ఉద్యోగం, చదువు అనే కార్యక్రమమని మొదలు పెట్టింది భారత ప్రభుత్వం. ప్రభుత్వానికి సంబంధించిన వెబ్ సైట్ www . sagaramala . gov . in ను కొంతమంది మోసగాళ్లు www . sagaramala . org . in గా మార్చి ప్రజలను, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. www . sagaramala . org . in లో ప్రభుత్వం ఇచ్చిన అసలు ప్రకటనను వీళ్ళ వెబ్ సైట్ లో చూపి ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ వెబ్ సైట్ లో ఉన్న ప్రభుత్వపు ప్రకటన చూసి వీళ్ళను కలిస్తే ప్రభుత్వం ప్రకటించిన నివాస్ యోజన, ఉద్యోగం, చదువు ఏవి రాకుండా ఈ మోసగాళ్ల చేతిలో మీరు నిండా మునిగి మోస పోతారు. ఇలాంటి నకిలీ వెబ్ సైట్స్ ఆధారం గా ప్రజలు మోసపుతున్నారని ప్రభుత్వాలు ఇప్పుడు ప్రజలకు రెడ్ ఎలర్ట్ జారీచేశాయి. నకిలీ సైట్స్ బారిన పడి ప్రజలు మోసపోకుండా ప్రభుత్వపు సైట్స్ కు నకిలీ ప్రభుత్వ సైట్స్ కు ఉన్న తేడాను గమనించి మోసపోకుండా ఉండాలి. ఫ్రెండ్స్ మీరు ప్రభుత్వానికి సంబందించిన ఫామ్ నింపేటప్పుడు దయచేసి ఆ ఫామ్ కింద www . sagaramala . gov . in అని ఉందా లేక www . sagaramala . org . in ఉందా అని గమనించండి. ఒక వేళా www . sagaramala . org . in అని ఉంటె వెంటనే మీరు ఇది మోసపూరిత వెబ్ సైట్ అని గమనించండి. ఒక వేళా www . sagaramala . gov . in అని ఉంటె ఇది నిజమైన భారత ప్రభుత్వపు వెబ్ సైట్ అని గమనించగలరు. ఇలాంటి మోసపూరిత వెబ్ సైట్స్ బారిన పడకుండా మీరు దయ చేసి కొంచెం అలెర్ట్ గా ఉండటం మంచింది అని ప్రభుత్వపు కోరిక.

Comments