రియల్ హీరో - మనోహరాచారిని ఎగిరితనిన ఒక్కమగాడు || Madhavi - Sandeep Erragadda Incident

               తిరగబడ్డ యువకుడు...శెభాష్ అంటున్న నెటిజన్లు

           పట్టపగలు వందలాది మంది ప్రజలమధ్య కన్నతండ్రి, కత్తితో దాడి చేస్తున్నప్పుడు అందరూ చూస్తున్నారే తప్ప ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయారు. మనోహరాచారి చేసిన ఘాతుకాన్ని కనీసం ఆపే ప్రయత్నం ఎవరూ చేయలేదు...దాడి చేసి కసాయి తండ్రి పారిపోయిన తరువాత రక్తపు మడుగులో పడిఉన్న మాధవి ని ముట్టుకోవడానికి కూడా ఎవరూ ప్రయత్నించలేదు...సీసీ టీవి ఫుటేజ్ లో విషయం స్పష్టంగా కనిపిస్తుంది.... అయితే ఘటన లో మనోహరాచారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దాడి చేస్తున్న మనోహరాచారిని దూరం నుంచి చూసి ఇద్దరు యువకులు ఆక్టివా మీద వచ్చారు,  ఒక్కసారిగా ఘటనకు చలించి పోయిన వారు కారు పక్కన వాహనాన్ని ఆపి, దిగి ఆమాంతం వచ్చి పైకి ఎగిరి  కాలితో గట్టిగా తన్నాడు. యువకుడు తన్నిన తర్వాత అతను తిరిగి యువతిపై దాడికి దిగలేదు. దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. యువకుడిని శభాష్ అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. మనుషుల్లో ఇంకా మానవత్వం ఉందని నిరూపించి వ్యక్తి ఇప్పుడు హీరో అయ్యాడు.

             నిజానికి దాడికి ముందు సందీప్ఇంటికెళ్లి మాధవిని తిరిగిరావాలని చారి బతిమిలాడాడు, కానీ మాధవి, సందీప్నిరాకరించడంతో మనోహరాచారి దాడికి తెగబడ్డాడు. ఏది ఏమైనా ఘటనలో ఒక్కడైనా తిరగబడి ఘటనను అడ్డుకునే పని చేసాడు...నిజానికి ఒక కాకి అపాయంలో పడ్డప్పుడు వందలాది కాకులు చేరి దానికి అండగా నిలుస్తాయి. కోటికిపైగా జనాభా ఉన్న మహానగరంలో మాత్రం జంటపై మానవమృగం దాడి చేస్తే ఎవరూ అడ్డుకోలేకపోయారు. కాకులకు ఉన్న జాలి కూడా మనుషులకు లేకుండా పోయింది. ఏది ఏమైనా ఒక్క యువకుడి తో పాటు మరో ఇద్దరు ధైర్యం చేసి ఐకమత్యం తో  అడ్డుకుని ఉంటె, బలమైన గాయాలు తగలకుండా ఉండేవి....ఎవరూ చేయలేనిది అతను చేసాడు కాబట్టి మనం కూడా అతన్ని మెచ్చుకుందాం....అతని డీటెయిల్స్ తెలీకపోయినప్పటికీ మన విషెస్ అతనికి అందాలని కోరుకుందాం..

Comments