ఆ పార్టీ నుండి MLAగా అమృత.. షాక్ లో TRS - కాంగ్రెస్ Amrutha To Contest as MLA From This Constituency

           త్వరలో అమృత రాజకీయ అరంగేట్రం.....అమృత చట్టం...రానుందా?

 అమృత విషయం లో మరో కొత్త వార్త తెర పైకి వచ్చింది...రాజకీయ అరంగేట్రం కోసం అండగా నిలుస్తామంటున్నారు రాజకీయ నేతలు..ఇంతకీ కొత్త వాదన ఎవరు తెసుకోచ్చారు...ఎందుకు తీసుకొచ్చారు...ఇది కూడా మరో నిర్భయ చట్టం చేసే ఆలోచన ఉందా? ఇక అపూర్తి వివరాలలోకి వెళితే...పెద్దలను, కుల కట్టుబాట్లను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రణయ్‌, కుల ఉన్మాదానికి బలైపోయాడు....అది పరువు హత్య అని అందరూ పత్రికల్లో రాస్తున్నా, కాదు ముమ్మాటికీ కుల హత్యే అని గొంతెత్తి ఎవరూ చెప్పలేని పరిస్థితి, నేటి సమాజం లో దాపురించింది...అమృత పరిస్థితి దిక్కుతోచని పరిస్థితి....ఒక్కసారిగా వంటరి అయిన ఆడపిల్ల పై, ఎన్నో ప్రచారాలు మొదలయ్యాయి....సొంత మరిది తో పెళ్లి అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి...తోడేళ్ళకు తోడ పుట్టినట్టు వ్యవహరిస్తునారు అమృత కొంతమంది....ఒంటరి అయిన అమృత ప్రణయ్ జ్ఞాపకాలతో కాలం గడపాల్సిందే...పుట్టబోయే బిడ్డ కోసం..ఎదురు చూడాల్సిందే...సరిగ్గా ఇదే సమయం లో, ఆమె కోసం కులసంఘాలు,  విద్యార్ధి సంఘాలు, రాజకీయ నేతలు,  అండగా నిలుస్తున్నారు....తాజాగా పెరుమాళ్ల ప్రణయ్ ఫ్యామిలీని పరామర్శించి ఓదార్చిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టి.మాస్ కన్వీనర్ కంచె ఐలయ్య... అమృతను అసెంబ్లీకి పంపుదామనే ప్రతిపాదన పెట్టారు.

       మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ప్రణయ్భార్య అమృత వర్షిణిని ఏకగ్రీవంగా అసెంబ్లీకి పంపాలని ప్రతిపాదించారు తమ్మినేని వీరభద్రం... ఆమె సిద్ధపడితే బీఎల్ఎఫ్నుంచి టికెట్ ఇస్తామని ప్రకటించిన ఆయన... రాజకీయ పార్టీలు మాటలు మాట్లాడడం కాదు... చేతనైతే అమృతను ఏకగ్రీవంగా ఎన్నుకుని అసెంబ్లీకి పంపేందుకు సిద్ధపడాలని సవాల్ చేశారు. ప్రణయ్ భార్య అమృత చాలా పట్టుదలతో ఉందన్న తమ్మినేని... నా భర్తను పొట్టనబెట్టుకున్న కుల దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడుతానని స్పష్టం చేసింది. ఆమె చైతన్యాన్ని ప్రదర్శించడానికి చట్టసభ వేదిక కావాలి... అందుకు కొంత సమయం తీసుకొనైనా అమృత నిర్ణయం తీసుకోవాలని కోరారు. అన్ని పార్టీలు అమృతకు మద్దతు తెలిపేందుకు సిద్ధమైతే... మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుంచి సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డిని పోటీకి పెట్టమని ప్రకటించారు తమ్మినేని వీరభద్రం.గతం లో నిర్భయ ఉదంతం యావత్ భారతాన్ని కదిలించింది...చివరికి నిర్భయ చట్టం అమలులోకి వచ్చింది....ఇది మన దేశం లో ఉన్న కులాంతర వివాహాలకు ఉన్న హోదా...ఇక పోతే అమృత రాజకీయ అరంగేట్రం ఎంతమేరకు ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి...ఒకవేళ, కులాలకు అతీతంగా తాను పోరాడితే, పోరాటం ఫలించి సమగ్రమైన చట్టం రూపం లో రావాలి..అమృత చట్టం రావాలి... ఇకపై ఎవరూ కులాంతర వివాహం చేసుకున్నా వారికి అండగా నిలిచే లాగా, ఉండాలి...మరో ప్రణయ్ బాలి కాకూడదు.... ఇవిదంగా జరిగితే రాజకీయ నాయకులు కొంత వరకు సక్సెస్ అయినట్టే...ఏది ఏమైనా...ప్రణయ్ మరణం కులాంతర హత్యలకు ఒక ఫులిస్టాప్ అవ్వాలని మనందరం ఆశిద్దాం....

Comments