Air Asia Bumper Offer - Ticket only 500/- || Hyderabad to Any Where ||| Air Asia Special Offer

       ఇక నుండి రూ. 500లకే విమానం లో జర్నీ.. ఎయిర్ ఏసియా బంపర్ ఆఫర్

           సామాన్యుడు విమానం ఎక్కాలంటే కాస్త కష్టం తో కూడుకున్న పనే...ఇక పేదవారి కి అది అందని ద్రాక్ష కిందే లెక్క....మన దేశంలో దూర ప్రయాణాలకు, దాదాపు  ట్రైన్ లోనే వెళుతుంటారు చాలామంది...ఖర్చు తక్కువ అని అందరూ ట్రైన్ నే ప్రిఫర్ చేస్తుంటారు...ఏదైనా అర్జెంట్ పని మీద తొందరగా వెళ్ళాలంటే మాత్రం విమానం చాలా సులువైన మార్గం...కానీ మనదేశంలోనే విమాన ఖర్చులు తడిసి మోపెడు అవుతాయి....సంపాదనే అంతంత మాత్రం ఉన్నప్పుడు, ఉన్నదంతా దానికే పెడితే మనకేం మిగులుతుంది అని అనుకుంటారు అంతా....కానీ ఇపుడు అలా కాదు, సామాన్యుడి కల నెరవేర్చడానికి ముందుకు వచ్చింది ఎయిర్ ఏషియా సంస్థ....అవును ఇపుడు సంస్థే మన విమానయాత్రను సులభతరం చేయబోతోంది....నిజానికి చాలా విమానయాన సంస్థలు  సామాన్యుడిని ఆకర్షించడానికి విమానధరలు తగ్గిస్తూ వస్తున్నాయి... ఇలా చాలా ప్రైవేటు, ప్రభుత్వ  విమానకంపెనీలు చేస్తున్నాయి...ఇక ఇపుడు ఆయా కంపెనీల మధ్య పోటీ ప్రయాణికులు వరంగా మారుతోంది.

          ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏసియా రూ. 500లకే ప్లేన్ జర్నీ అందిస్తోంది. ఇప్పటికే టికెట్ల అమ్మకం మొదలైంది. మన దేశంలో 21మార్గాల్లో   ప్రత్యేక ఆఫర్వర్తిస్తుంది. రూ.500, 1,000, రూ. 1,500లతో వన్వే టికెట్లను సబ్సిడీ తో అమ్ముతున్నారు. అయితే   టికెట్లను నెల23లోగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 17 – మార్చి, 31, 2019 మధ్య ప్రయాణాలు ఉంటాయి. ఎయిర్ఏషియా. కాం, ఎయిర్ఏషియా మొబైల్యాప్లలోనే టికెట్లను కొనుక్కోవాల్సి ఉంటుంది. హైదరాబాద్,  విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, అమృత్సర్‌, భువనేశ్వర్, చండీగఢ్, గౌహతి, ఇంఫాల్, ఇండోర్, జైపూర్, కోల్కతా, కొచ్చి, నాగ్పూర్, న్యూఢిల్లీ, పనాజీ, పూణే, రాంచీ , శ్రీనగర్, సూరత్నగరాలకు ఎయిర్ ఆసియా సర్వీసులు నడుపుతోంది.ఇంకేందుకండీ ఆలస్యం విమానం లో ఎగరాలని, ప్లేన్ జర్నీ చేయాలనే కోరిక ఉన్నవారు తొందరగా అప్లయ్ చేయండి మీకు ఇష్టమైన ప్లేస్ కి వెళ్లి ఎంజాయ్ చేయండి... 

Comments