Jr Ntr Emotional Words On Pranay Amrutha Issue |#Pranay |#Amruthavarshini | Miryalaguda

    అమృత కష్టం చూసి కన్నీరు పెట్టుకున్న తారక్ ! ఏమి మాట్లాడాడో చూడండి !

            నల్గొండ జిల్లా, మిర్యాల గూడలో జరిగిన పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి సంచలనంగా మారిపోతుంది. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట అన్యోన్యంగా జీవిస్తుంటే చూసి సంతోషించాల్సిన తండ్రే.. కసాయిగా మారి అల్లుడిని చంపించిన విషయం తెలిసింది. తమకంటే తక్కువ కులం వాడిని కూతురు పెళ్లి చేసుకుంది అన్న కారణంగా మారుతిరావు తన అల్లుడైన ప్రణయ్ ని ఇలా పరువు హత్య చేయించడం.. సమాజంలో పేరుకొనిపోయిన కుల జాడ్యానికి నిలువెత్తు నిదర్శణంగా చెప్పుకోవచ్చు.అయితే తన కళ్ళ ముందే భర్త మరణంతో అల్లాడిపోయిన 5 నెలల గర్భంతో ఉన్న అమృత ఇప్పుడు తండ్రి పై న్యాయ పోరాటానికి సిద్ధం అయింది. భర్త అనుకున్న ఆశయాలను సాధించడానికి, ప్రణయ్ కి న్యాయం చేయడానికి అమృత ఓ ఫేస్ బుక్ పేజ్ ని కూడా మొదలు పెట్టింది. పేజ్ క్రియేట్ చేసిన ఒక్కరోజులోనే లక్షల మంది ఆ పేజ్ ని లైక్ చేసి.. ప్రణయ్ కి న్యాయం జరగాలని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇంత కష్టాన్ని ఎదుర్కొంటున్న అమృతకి సామాన్య ప్రజల నుండే కాకుండా.. సినీ సెలబ్రెటీల నుండి కూడా మద్దతు లభిస్తుంది. రీసెంట్ గా ఈ దారుణ ఘటన పై తారక్ చాలా ఎమోషనల్ గా స్పందించినట్టు సమాచారం. నా చెల్లి అమృత కష్టాన్ని నేను అర్ధం చేసుకోగలను.

            మన జీవితంలో ఆత్యంత ముఖ్యమైన వ్యక్తి.. ఒక్కసారిగా మనతో లేకుండా పోతే ఆ కష్టాన్ని తట్టుకోవడం చాలా కష్టం. నా పెద్ద అన్న, నా తండ్రి విషయంలో నేను ఆ కష్టాన్ని అనుభవించాను. అమృత బాధ మనం ఎవ్వరం తీర్చలేనిది. అయితే ఈ సమయంలో ఆమెకి మన సపోర్ట్ చాలా అవసరం. ఏ కుల అహంకారం అయితే ప్రణయ్ చావుకి కారణం అయ్యి.. అమృత జీవితాన్ని ఇలా నాశనం చేసిందో.. ఇప్పుడు ఆ కుల జాడ్యం పై అమృత ధైర్యంగా న్యాయపోరాటానికి దిగింది. ఇలాంటి సమయంలో ఆమెకి మన అండ అవసరం. అమృతకి అండగా నేను ఉంటాను..అంటూ తారక్ ఈ విషయంలో బాగా ఎమోషనల్ అయినట్టు తెలుస్తుంది.   నిజానికి తారక్ గత కొంత కాలంగా తండ్రిపోయిన బాధలోనే ఉన్నారు. అయితే ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో అరవింద సమేత షూటింగ్ లో పాల్గొంటున్నారు . ఇలా పరిస్థితుల్లో తారక్ ఈ పరువు హత్య గురించి తెలుసుకొని షాక్ అయినట్టు తెలుస్తుంది. నిజానికి మొదటి నుండి ఆడవారికి అమితమైన గౌరవం ఇవ్వడం, ప్రతి ఒక్కరిని అమ్మా.. అమ్మా.. అంటూ ఆప్యాయంగా పిలవడం తారక్ కి అలవాటు. అందుకే ప్రణయ్ హత్యా విషయం తెలిశాక.. అమృత కష్టం తెలుసుకున్నాక .. ఎన్టీఆర్ ఈ విషయంలో ఇంత ఎమోషనల్ అయినట్టు తెలుస్తుంది. 

Comments