ఆంటీ ఆంటీ ప్రణయ్ ని కొట్టారు - ప్రణయ్ హైదరాబాద్ లో ఉన్నాడు Doctor Jyothi told About Pranay to Amruta

         అమృత కోసం అబద్ధం చెప్పాల్సి వచ్చింది..ఆరోజు ఎం జరిగిందంటే....డాక్టర్ జ్యోతి

              ప్రణయ్, అమృతల కులహత్య అందరిని కలచివేస్తోంది....అన్యాయంగా అల్లుడిని పొట్టన పెట్టుకున్నాడు అని మారుతీరావు పై అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు...మరోవైపు అమృత తనవారు, తనను ఎంత బాధ పెట్టారో అన్ని విషయాలు ఒక్కొక్కటిగా మీడియా కి చెప్పుకుంటూ వస్తోంది...నిజానికి హత్య జరిగిన తరువాత ప్రణయ్ స్పాట్ లో చనిపోయినట్టు అమృతకు తెలీదు...అనుమానం రాకుండా అమృత కి ట్రీట్మెంట్ చేసారు..డాక్టర్...అసలు ఆరోజు ఏమైంది, అమృత ఎలా తట్టుకోగలిగింది అని అందరికి అనుమానం ఉంది కానీ ఆరోజు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఆరోజు అమృతను నమ్మించడానికి ఎం చెప్పారు వంటి విషయాలను స్వయంగా డాక్టరు విషయాలను మీడియాకి వివరించారు...

           నిజానికి ఆరోజు ప్రణయ్ చనిపోయాడన్న విషయాన్ని అమృతకు  తరువాతి రోజు వరకూ  చెప్పకుండా తాను దాచిపెట్టానని, సమయంలో అమృత పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్న తనకు అంతకన్నా మరో మార్గం తట్టలేదని డాక్టర్ జ్యోతి తెలిపారు. విషయం తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయంతో, ప్రణయ్ బతికే ఉన్నాడని అబద్ధం చెప్పానని గుర్తు చేసుకున్నారు.ప్రణయ్ కి ఫస్ట్ ఎయిడ్ చేసిన తరువాత అంబులెన్స్ లో హైదరాబాద్ కు పంపించానని, అక్కడ ఐసీయూలో చికిత్స జరుగుతోందని, ప్రణయ్ తప్పకుండా వస్తాడని ఒక రోజంతా ఆమెను నమ్మించానని అన్నారు. ఆపై కాస్తంత సీరియస్ గా ఉన్నాడట అని, ట్వంటీ పర్సంట్ మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయట అని చెబుతూ, ఆమెను ప్రిపేర్ చేయాల్సి వచ్చిందని డాక్టర్ జ్యోతి వెల్లడించారు.తానేదో మంచి వార్తను ఇస్తానన్న నమ్మకంతో అమృత, మరుసటి రోజు ఉదయం వరకూ ఆశగా వేచి చూసిందని, అసలు విషయం చెప్పిన తరువాత, తాను అమృత దగ్గరే మూడు గంటల పాటు కూర్చుని ఓదార్చానని అన్నారు. సమయంలో ప్రణయ్ చనిపోయాడన్న బాధలో అతని తల్లిదండ్రులు ఉన్నారని, అమృతను సొంత కూతురిలా  ఓదార్చానని డాక్టర్ జ్యోతి వివరించారు.ఇలా చాలా మంది ప్రణయో హత్య అందరిని కలచివేసింది....ఇదే చివరి కుల హత్య కావాలని, ఇక నుండి యే ప్రేమికులకి ఇలాంటి దుస్థితి రాకూడదని కోరుకుంటున్నామంటూ యూత్ అంతా సపోర్ట్ గా నిలుస్తోంది...జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ ఒక ఫేస్ బుక్ పేజ్ ని కూడా ఓపెన్ చేసారు కొంతమంది..సరైన తీర్పు రావాలని కోరుకుంటున్నామని దీని ఉద్దేశ్యం..మనం కూడా హత్యకి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన వారికి తగిన శిక్ష పడాలని కోరుకుందాం... 

Comments