అమృత ప్రణయ్ పై మంచు మనోజ్ రాసిన సంచలన లేఖ || Manchu Manoj Emotional Letter to Public on Pranay

    మంచు మనోజ్...కులం, మతం ఎక్కువని భావించే వారికే ఈ లేఖ

         తాజాగా ప్రణయ్ ప్రేమ హత్య ఎంత కలకలం రేపిందో తెలిసిందే...ఒక్కసారిగా ప్రేమికలోకం కన్నెర్ర చేసిన సంఘటన...కన్న తండ్రికే ఉరిశిక్ష వేయాలని కోరుకుందంటే కూతురు అమృత ఎంత వేదన అనుభవించిందో అర్ధం చేసుకోవచ్చు....ఈ విషయం పై పలు సంఘాల నేతలు ,రాజకీయ నేతలు, యువత తీవ్రంగా స్పందించారు.....ఈ ఘటన కేవలం పరువు, కులం పిచ్చి, వల్లనే జరిగింది అనేది వాస్తవం.... తాజగా ఇదే విషయమ పై, హీరో మంచు మనోజ్ కూడ స్పందించారు....ఒక లెటర్ ని రాసి ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు మనోజ్... లెటర్ లో ఇలా రాసాడు...మానవత్వం కంటే కులం, మతమే ఎక్కువని భావించే వారికే ఈ లేఖ. సినీ పరిశ్రమ కానీ, రాజకీయ పార్టీలు కానీ, కాలేజ్ యూనియన్లు కానీ, కుల లేదా మత సంఘాలు కానీ, మరే రంగమైనా కానీ... క్యాస్ట్ ఫీలింగ్స్ చాలా దారుణం. ప్రణయ్ తో పాటు మరెందరినో బలిగొన్న ఈ దారుణాలకు కులాలను, మతాలను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించే వారే కారణం. మనిషి జీవితం కంటే మరేదీ ఎక్కువ కాదనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం. తన తండ్రిని స్పర్శించక ముందే ఒక బిడ్డ కన్న తండ్రిని కోల్పోవడం మనస్సును కలచి వేసే అంశం. కేవలం కులం కోసం వాళ్ల జీవితాలను ఛిన్నాభిన్నం చేశారు. వారి జీవితాల కంటే మీకు కులమే ఎక్కువా? మన అందరికీ ఒకేలాంటి గుండె, శరీరం ఉన్నాయి.

           మనం పీల్చే గాలి కూడా ఒక్కటే. కానీ, కులం, మతం పేరుతో మరొకరి పట్ల అమానుషంగా ప్రవర్తించడం ఎంత వరకు సబబు? మనుషులంతా ఒకటే అనే విషయాన్ని ఈ ప్రపంచం ఎప్పుడు తెలుసుకుంటుంది? కుల ప్రేమికులను, చూసి సిగ్గుపడుతున్నా. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తే కాకుండా... కులాలను అమితంగా ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ ఘటనకు బాధ్యులే. కుల వివక్ష నశించాలి. ఈ మహమ్మారిని వెంటనే అంతం చేయాలి. మనుషుల్లా ప్రవర్తించండి. మీ అందరికీ ఇదే నా హృదయపూర్వక విన్నపం. మన చిన్నారులకు మంచి భవిష్యత్తును అందిద్దాం. అమృత పరిస్థితి నన్ను ఎంతగానో కలచి వేసింది. ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" అంటూ ట్విట్టర్ ద్వారా మనోజ్ తన ఎమోష్ నల్ లెటర్ ని పోస్ట్ చేసాడు...ఇక నుండైనా మానవత్వాన్ని పెంచుదాం..ప్రేమించడం తప్పు కాదు, కాబోయే జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్చ ఎవరికైనా ఉంది...కులం గోడలు పట్టుకుని కూర్చుంటే నిండు ప్రాణాల్ని బలిగొన్న పాపం, పది జన్మలు ఎత్తి వారి సేవ చేసినా తీరదు...ప్రేమను బతికిద్దాం...ప్రేమకు స్వేచ్చను తీసుకొద్దాం...

Comments