Kaushal Wife Neelima Shocking Tweet to Kaushal Army after Met Kaushal | Bigg Boss 2 Telugu

          హౌస్ నుండి బయటకి వచ్చాక కౌశల్ భార్య చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు !

         బిగ్ బాస్.. సీజన్ 2 ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్లిపోయింది. ఎంతలా అంటే ప్రేక్షకులు రోజంతా షో గురించి మాట్లాడుకునే అంతలా! షో లో తమకి నచ్చిన కంటెస్టెంట్ కోసం ఏమైనా చేసే అంతలా! షో లో తమకి నచ్చని విషయం, తాము ఊహించని విషయం జరిగితే షో యాజమాన్యాన్ని తిట్టుకునేంతలా ! ఒక రియాలిటీ షో ఇంత సక్సస్ అవుద్దా అని అంతా నోర్లు తెరిచే అంతలా! అవును బిగ్ బాస్ సీజన్ అంతలా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లోకి వెళ్లిపోయింది. అయితే షో పై ఇంతలా ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఎవరు అంటే మాత్రం వినిపించే ఒకే ఒక్క పేరు కౌశల్. కౌశల్ అనే ఒకే ఒక్క పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర ప్రేక్షకులని ఒక ఊపు ఊపేస్తోంది. 

         ఇక ఇన్ని రోజులు పాటు కోపాలు, తాపాలు గొడవలు, కొట్లాటలు, చాడీలు, సర్దుబాట్లు, దిద్దుబాట్లు,మధ్య ప్రేక్షకుల ఎమోషన్ తో సక్సస్ గా రన్ అయిన బిగ్ బాస్ 2 లో ఇప్పుడు నిజమైన భావోద్వేగాలు షో ని రక్తి కట్టిస్తున్నాయి.విజేత గా నిలవడానికి.. కొన్ని నెలలుగా అయిన వారిని వదిలి, రక్త బంధాలని వదిలి కొత్త ప్రపంచంలో బతుకుతున్న పార్టిసిపెంట్స్ అందరికి బిగ్ బాస్ ఫ్రీజ్ టాస్క్ ఇచ్చి.. మళ్ళీ వారి ప్రపంచాన్ని వారికి పరిచయం చేశాడు. ఇన్ని రోజుల తరువాత ఒక్కో కంటెస్టెంట్ తమ వారిని చూసి భావోద్వేగానికి గురి అవుతుంటే ప్రేక్షకులు కూడా కన్నీరు పెట్టేసుకుంటున్నారు. 

        ఇక ఈ సీజన్ సక్సస్ కి ప్రధాన కారణం అయిన కౌశల్ కూడా చాలా తరువాత తన భార్య బిడ్డలని కలుసుకొని కన్నీరు పెట్టేసుకున్నారు. కౌశల్ భార్య కౌశల్ ని కలుసుకొని చాలా విషయాల గురించి చర్చించింది. ఇంటి పరిస్థితులతో పాటు, పిల్లల గురించి ముందుగా చెప్పుకొచ్చింది. ఆ తరువాత బయట షో గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు? ప్రేక్షకుల దృష్టిలో కౌశల్ స్థానం ఏమిటి అన్న విషయాలను చెప్పుకొచ్చింది. ముఖ్యంగా కౌశల్ ఆర్మీ.. కౌశల్ మీద చూపిస్తున్న ప్రేమ గురించి చెప్పగానే కౌశల్ ఏడ్చేశాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చాక ఈ విషయాలు అన్నిటిని తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేసింది. చాలా రోజుల తరువాత నా భర్తని కలుసుకోవడం ఆనందంగా ఉంది. తనతో చాలా విషయాలు మాట్లాడాను. ముఖ్యంగా మీ గురించి మీరు చూపిస్తున్న అభిమానం గురించి చెప్పాను. ఇప్పుడు తాను కౌశల్ భార్యని అని చెప్పుకోవడానికి గర్వ పడుతున్నాడు అని కూడా చెప్పాను. కౌశల్ చాలా ఆనందపడిపోయాడు. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ కౌశల్ కి ఉండే క్రేజ్ గురించి, కౌశల్ ఆర్మీ గురించి షోలో ఎందుకు చూపించడం లేదో నాకు అర్ధం కావడం లేదు. అలా చూపిస్తే కౌశల్ క్రేజ్ మరింత పెరుగుతుంది కదా.. షో నిర్వాహకులు ఎలా ఎందుకు ఆలోచించడం లేదు అంటూ నీలిమ పోస్ట్ చేసింది. ఏదేమైనా కౌశల్ కోసం, కౌశల్ విజయం కోసం నీలిమ పడుతున్న కష్టం చూసి.. కౌశల్ ఫ్యాన్స్ కూడా ఆమెని పొగడ్తలతో మంచెత్తుతున్నారు. 

Comments