సినిమాలు లేకపోవడంతో గుడిమెట్ల దగ్గర బిచ్చమెత్తుకుంటున్నటాప్ డైరెక్టర్ | Top Director Turns Beggar

        సినిమాలు లేకపోవడంతో గుడిమెట్ల దగ్గర బిచ్చమెత్తుకుంటున్నటాప్ డైరెక్టర్ 

          తమిళ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు సెంథిల్ నాథన్ సినిమాల్లో ఆఫర్ లేక పోవడంతో కలత చెంది కంచి దేవాలయం వద్ద బిక్షాటనం చేస్తూ ఉన్నాడు. దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖరన్ వద్ద సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సెంథిల్ నాథన్.. ఆ తరువాత విజయకాంత్ నటించిన ‘పూందోట్ట కావల్క్కాన్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఒకప్పుడు ఎంజీఆర్ సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన జంబులింగం గారి తనయుడే సెంథిల్ నాథన్. తమిళ సినీ పరిశ్రమతో వీరి కుటుంబానిది కొన్ని తరాల నుండి కొనసాగుతున్న అనుబంధం. తండ్రి నడిచిన బాటలోనే సినీ ఇండస్ట్రీకి వచ్చాడు.అసిస్టెంట్ గా కొన్నాళ్ళు పనిచేసి దర్శకుడిగా మారారు. తమిళంలో దాదాపు 20 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన స్వీయ దర్శక నిర్మాణంలో 2009లో ‘ఉన్నై నాన్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఆయన ఎన్నో ఆర్థిక సమస్యలు, కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. దీంతో ఈ చిత్రం విడుదల కాలేదు. ఆ తరువాత సెంథిల్నాథన్ బుల్లితెరపై దృష్టి సారించినా.. అక్కడ విజయం సాధించలేకపోయారు. 

          స్వీయ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సీరియల్ నుంచి ఆయనను ఇటీవల తొలగించారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన సెంథిల్నాథన్.. ఇంటిని వదిలి కంచికి వెళ్లిపోయారు. అక్కడి ఆలయం వద్ద భిక్షాటన చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. ఈ విషయం తెలిసిన అతని కుటుంబసభ్యులు, సినీపరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు అక్కడికి వెళ్లి ఆయన్ని వెనుకకి రమ్మని కోరగా.. రానని కరా ఖండిగా తేల్చి చెప్పేశారట. దీంతో కుటుంబసభ్యుల పోలీసుల సహాయంతో సెంథిల్ నాథన్ ను చెన్నైకు తీసుకొచ్చి.. ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. చూశారుగా సినిమా వారి జీవిత్తనాలు ఎలా ఉంటాయో. తెర పైన కనిపించే ఆ రంగుల మొహాల వెనుక.. ప్రేక్షకుడి కళ్ళతో చూడలేని కష్టాల్లో ఎన్నో ఉంటాయో. ప్రేక్షకులను నవ్వించే ఆ నవ్వుల వెనుక.. జీవితాలని చిదిమేస్తున్న బాధలు ఇంకెన్నో ఉంటాయి. అందుకే ఇది మయా ప్రపంచం

Comments