మొగుడు VS పెళ్ళాం || Shailaja Reddy Alludu VS U TURN Review || Samantha VS Naga Chaitanya

         మొగుడు పెళ్ళాం పోటీ ఎవరు గెలిచారు.....సమాంత యూ టర్న్ కి,  శైలజా అల్లుడు షాక్

         ఈ వినాయక చవితికి  సినిమా లవర్స్ కోసం డబుల్ ధమాకా అందించింది అక్కినేని ఫ్యామిలీ...చైతు, సామ్ లు ఇద్దరూ నటించిన సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడంతో ఇరువైపులా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు...ఇక సినిమాల రివ్యూ విషయానికి వస్తే....ఇప్పటికే సినిమా టైటిల్ ని చూస్తే ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్ధం అయిపోతుంది....ఒకసారి కధలోకి వెళితే ... విషయం లోనైనా పాజిటివ్ గా ఆలోచించే తత్వం ఉన్నవాడు హీరో...కానీ అనుకోకుండా హీరోయిన్ తో ప్రేమలో  పడి, ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రేమను గెలిపించుకోవడానికి దేనికైనా సిద్ధపడతాడు...కానీ ఇక్కడ ప్రేమకు ప్రధాన విలన్ అత్త...అంటే రమ్య కృష్ణ....రమ్య కృష్ణ  కూతురు అను ఇమ్మాన్యుయేల్ కి అంటే తల్లి కూతుళ్ళకి ఇద్దరికీ ఈగో చాలా ఎక్కువ...కానీ అను ప్రేమలో పడిన తర్వాత తల్లిని ఎదురించడం....తల్లి దారిలోనే ఈగో తో వెళ్లి ప్రేమను ఎలా దక్కించుకుంది అనేది సినిమాలో చూడాల్సిందే....

        అలాగే ఇటు హీరో తండ్రికి, హీరోయిన్ తల్లి రమ్య కృష్ణకి పాత గొడవల వల్ల వీరిద్దరిని దూరం చెయ్యడానికి వేరే సంబంధం చూడటం, ఇంతలో అల్లుడు చైతు, అత్తను ఎలా గెలిచాడు అనేది సినిమా లో చూడాల్సిన అంశం...మొత్తం మీద కధ మామూలు గానే ఉన్నా సన్నివేశాలు, రమ్య కృష్ణ నటన సినిమా కి ప్లస్ పాయింట్స్...ఇప్పటికే మన ఇండస్ట్రీలో అత్తా అల్లుడు కాన్సెప్ట్ తో చాలా సినిమా లు వచ్చాయి. దర్శకుడు మారుతి ఇప్పుడు అదే చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన అత్త-అల్లుడు సినిమాలు అన్నీ రెండుపాత్రల మధ్య పోటాపోటీ నడిచినవే...కానీ ఈసారి మారుతి, అత్త అల్లుడు అని కాకుండా, తల్లీ కూతుర్ల కాన్ ఫ్లిక్ట్ తో కథ అల్లి, అందులో అల్లుడిని ఇరికించి తమాషా చూపే ప్రయత్నం చేసినట్లుంది.అప్పట్లో అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, నాగార్జున యాక్ట్ చేసిన అల్లరి అల్లుడు  సినిమా లాగే ఆకట్టుకోనుంది...ఫస్ట్ ఆఫ్ లోనే మారుతి మార్క్ మొత్తం కనిపిస్తుంది...ఇక సెకండ్ ఆఫ్ లో క్లైమాక్స్ నార్మల్ ఉంటుంది...నిజానికి  సినిమా లో స్టోరీ లేకపోయినా కామెడీ తో హిట్ చేయగల సత్తా మారుతీ కి ఉందని చెప్పాలి. రేటింగ్ 2 ఇవ్వొచ్చు......

      ఇక సమాంత యు టర్న్ విషయానికి వస్తే...భర్త చైతు తో పోటీ పడి మరీ యాక్ట్ చేసింది...నిజానికి సమాంత యు టర్న్ తో ఒక వినూత్న ప్రయోగం చేసింది...మహానటి సినిమాతో పాత్ర కు ప్రాధాన్యం ఉన్న సినిమా చేయడంతో, సినిమాలో  పాత్ర ప్రాధాన్యం కొద్ది సమయం ఉన్నా చాలు సినిమాలు చేస్తానని చెప్పిన సమాంత ఇపుడు అదే పని చేసింది.. ప్రయోగాల మీద పడింది సమాంత...మహానటి లో ఒక రిపోర్టర్ గా చేసిన సమాంత...యూ టర్న్ సినిమాతో రచన అనే పాత్రికేయురాలిగా కనిపిస్తుంది. ఇప్పటివరకు తను చేసిన పాత్రలు  ఒకెత్తైతే, సినిమా మరో ఎత్తు. అవుతుంది...కధ మొత్తం తన చుట్టే తిరుగుతుంది...కన్నడలో సూపర్ హిట్ అయిన యూటర్న్ మూవీని తెలుగులో అదే పేరుతో మనముందుకు వచ్చింది. మిస్టరీ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన మూవీలో సమంత జర్నలిస్ట్‌గా కనిపించనుంది. కన్నడ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన పవన్ కుమార్, తెలుగు వెర్షన్ ని కూడా ఆయనే డైరెక్ట్ చేసారు...ఆర్కేపురం ఫ్రై ఓవర్ మీద జరిగిన ఆక్సిడెంట్చుట్టూ కథ తిరుగుతుందిని ఇప్పటికే  ట్రైలర్‌ని బట్టి అర్ధమౌతోంది. ఆది పినిశెట్టి ఇన్వెస్టిగేషన్ అఫీసర్‌గా కనిపిస్తున్నారు. భూమిక , అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

      ఒక జర్నలిస్ట్ గా సమాంత సినిమాలో అద్భుతమైన నటన తో ఆకట్టుకుంది...జర్నలిస్ట్ గా కెరీర్ ని ప్రారంభించిన సమాంత...అనుకోకుండా ఒక ఫ్లై ఓవర్ పై వెళుతుండగా ఒక ఆక్సిడెంట్ జరుగుతుంది...అందులో చనిపోయిన కుటుంబం ఎవరు వారికి, సమంతా అందులో ఎలా ఇరుక్కుంటుంది..అనేది కధాంశం.. అయితే ఇందులో భూమిక పాత్ర మరో ప్రధాన మైన పాత్ర... చనిపోయిన కుటుంబం లో భూమిక ఒకరు...చనిపోయిన భూమిక ఆత్మ రూపం లో తనకు జరగవలసిన న్యాయం గురించి ఎలా పోరాడింది...అందుకోసం సమాంత ని ఎలా వాడుకుంది..చివరికి కేసు ఎలా కొలిక్కి వచ్చింది, అనేది సస్పెన్స్....అలాగే అసలు ఆక్సిడెంట్ సమాంత కావాలనే చేసిందా లేక అనుకోకుండా నేరం తనపై పడుతుందా అనేది సినిమాలో చూడాల్సిన అంశం....మిస్టరీ థ్రిల్లర్ కాబట్టి సినిమా మొత్తం ఆసక్తి కరంగా ఉంటుంది...ఫస్ట్ కంటే సెకండ్ ఆఫ్ బాగా ఆకట్టుకుంటుంది... సినిమా కి  రేటింగ్  2.3 మొత్తానికి రెండు సినిమాలు, బాక్సాఫీస్ వద్ద పండగ సీజన్ కాబట్టి కలెక్షన్ పరంగా దూసుకుపోవడం ఖాయం...సమాంత తీసుకున్న యు టర్న్ కి , శైలజా రెడ్డి అల్లుడు  షాక్ అయ్యాడనే చెప్పాలి...కానీ కలెక్షన్ పరంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి అందరికి బాగా కనెక్ట్ అవుతుంది...ఇక నటన పరంగా సమాంత ని యూ టర్న్ ఇంకో ఎత్తుకి తీసుకెళ్లడం ఖాయం...

Comments