ప్రపంచంలోనే ఈ వినాయకుడిని ఎవరూ చూసి ఉండరు ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే ఉందిLord Ganesha In Pin Needle

       సూది బెజ్జంలో సూక్ష్మ వినాయకుడు....అద్భుతం సృష్టించిన అతను

         అజయ్కుమార్ అనే వ్యక్తి అద్బుతాన్ని సృష్టించాడు. ఇప్పటి వరకు మీరు ఎన్నడూ చూడని బుల్లి వినాయకుడిని తయారు చేసాడు....మహా అయితే అంగుళం అంత చిన్న విగ్రహాన్ని తయారు చేసదేమోలె అని అనుకుంటే పొరపాటే...అంతకు మించిందే చేసాడు...ఇప్పటివరకు మనం రకరకాల ఆకారాల్లో, విచిత్రమైన ఫోజుల్లో వినాయకుడి విగ్రహాలను చూసాం...ఆఖరుకి ఆనిమేషన్ వినాయకులను కూడా చూసాం, పెద్ద పెద్ద భారీ వినాయకులను, పళ్ళతో, స్పూన్ లతో, గింజలతో, చేసిన గణపతులను కూడా చూసేసాం...కానీ వినాయకుడిని చూస్తే నోరు తెరవాల్సిందే...

           మనకు అపుడపుడు సూదిలో దారం ఎక్కించడానికే నానా యాతన పడతాం..కానీ సూదిలో వినాయకుడిని దూర్చేసాడు ఆయన... అవును మీరు విన్నది నిజమే ...మనందరికీ వినేందుకే ఇది విచిత్రంగా అనిపించొచ్చు. కానీ వరంగల్జిల్లా గిర్మాజీపేటకు చెందిన మైక్రో ఆర్టిస్టు, స్వర్ణకారుడు మట్టెవాడ అజయ్కుమార్కు మాత్రం ఇదంతా చిన్నపిల్లల ఆటే. వినాయక చవితి సందర్భంగా.. సూది రంద్రంలో 1.2 మిల్లిమీటర్ల అతి చిన్న వినాయక విగ్రహాన్ని తయారుచేసి వాహ్వా అనిపించారు. సాధారణ కంటికి కనిపించని విగ్రహాన్ని మైనంతో తయారుచేసి రంగులద్దిన అజయ్‌.. వినాయకుడి మెడలో 24 క్యారెట్ల బంగారు గొలుసును కూడా వేశారు. ఇంత చిన్న గణపతి చేతిలో లడ్డు. పక్కనే ఎలుకను తయారుచేసి ఔరా అనిపించారు. వినాయకవిగ్రహాన్ని తయారుచేయడానికి 12 గంటల సమయం పట్టిందని అజయ్కుమార్తెలిపారు.

      అజయ్‌కుమార్ మైక్రో ఆర్టిస్ట్గా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2004లో అతిచిన్న బంగారు తాళం 7 లీవర్లతో తయారు చేసి ప్రపంచ రికార్డు సాధించారు. మూడు సార్లు లీమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు.  ఏనుగు దంతాలపై శిల్పాలు, అగ్గిపుల్లలపై శిల్పాలు చెక్కి అంతర్జాతీయ, జాతీయ అవార్డులు అందుకున్నారు. ఏది ఏమైనా వినాయకుడు ఎంత భారీ గా ఉంటె అంత భక్తి వస్తుంది అనుకోవడం అవివేకమే అవుతుంది...ఆకారం చిన్నదైనా నిజమైన భక్తితో పూజిస్తే వినాయకుడు మనల్ని కరుణిస్తాడు...అనేది సత్యం....

Comments