తనీష్ తమ్ముడుప్రశ్నకి దిమ్మతిరిగే సమాధానంఇచ్చిన కౌశల్| Tanish Brother to Kaushal in BiggBoss2 Telugu

        కౌశల్ తో గొడవకి దిగిన తనీష్ తమ్ముడు ! 

        తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గొడవలు అలకలతో సాగిన ఈ సీజన్ లో ఫ్రీజ్ టాస్క్ హౌస్ లో ఎమోషన్స్ ని నింపింది.ఇన్ని రోజుల తరువాత తమకి ఇష్టమైన వారిని హౌస్ లో చూడగానే పార్టిసిపెంట్స్ అంతా ఎమోషనల్ అయిపోతూ ఆనంద భాష్పాలు కార్చేశారు. తమ వారు రావడంతో ఇంటి సభ్యులు ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఇక ఈ టాస్క్ లో తనీష్ తమ్ముడు క్రిష్ ప్రత్యేకంగా నిలిచాడు. ఈయన బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లి ఇంటి సభ్యులతో మాట్లాడటం జరిగింది. అందరు కూడా బాగా ఆడుతున్నారు అంటూ చెప్పిన క్రిష్ ఒక్క కౌశల్ తో మాత్రం కాస్త కోపంగా ప్రవర్తించడం అందరికి షాక్ కలిగించింది. 

 
          నిజానికి క్రిష్ ముందుగా హౌస్ లోకి రాగానే తన అన్న తనీష్ ని కలుసుకున్నాడు . చాలారోజుల తరువాత అన్నని చూసిన ఆనందంలో ఎమోషనల్ అయ్యాడు. తనీష్ తన తమ్ముడిని హత్తుకొని ఇంట్లో వాళ్ల క్షేమ సమాచారం కనుక్కున్నాడు .అన్నయ్యతో కాసేపు ముచ్చటించిన క్రిష్ నేను కౌశల్ తో మాట్లాడాలని చెప్పి తనీష్ దగ్గర నుండి కౌశల్ దగ్గరకి వెళ్లాడు. డైనింగ్ హాల్ దగ్గర అందరి ముందు కౌశల్ ని ప్రశ్నిస్తూ... ''కౌశల్ గారు మీరు దీప్తికి కెప్టెన్సీ పోయినప్పుడు ఆమెపై జాలి చూపించారు. ఆమెపై కన్సర్న్ ఉందని చెప్పిన మీరు కెమెరా దగ్గరకి వెళ్లి కుదిరితే నన్ను కెప్టెన్ చేయమని ఎలా అడిగారు'' అంటూ కౌశల్ పై అసహనం వ్యక్తం చేశాడు.

             ఈ విషయం విన్న దీప్తి షాక్ అయింది. దీనికి కౌశల్ కూడా అంతే దీటుగా సమాధానం ఇచ్చాడు. నేను ఒక్క దీప్తి మీద మాత్రమే కాదు హౌస్ లో ఇబ్బంది పడే ప్రతి సభ్యుడి పై కన్సర్న్ చూపిస్తా.. అలానే హౌస్ రూల్స్ ని ఎవరైనా బ్రేక్ చేసి లాభం పొందాలి అని చూస్తే వాళ్ళని ప్రశ్నిస్తా..ఇక దీప్తి కెప్టెన్సీ ని నేను కోరడం కూడా గేమ్ లో భాగంగా చేసిందే. ఆమె ఓ చిన్న తప్పు కారణంగా తన కెప్టెన్సీ కోల్పోయింది. మళ్ళీ బిగ్ బాస్ ఆ ఛాన్స్ ఆమెకి ఇస్తాడన్న నమ్మకం లేదు. అప్పుడు హౌస్ కి ఎవరో ఒకరు కెప్టెన్ కావాలి. ఆ అవకాశాన్నే నేను కోరాను అందులో తప్పు ఏముంది అంటూ ప్రశ్నించాడు. అలా కౌశల్ తనీష్ తమ్ముడికి దిమ్మ తిరిగిపోయేలా సమాధానం ఇవ్వడంతో.. ఏమో ఇవన్నీ నాకు ఎందుకు మీరు మీరు చూసుకోండి అంటూ కౌశల్ పై కోపాన్ని ప్రదర్శిస్తూ అక్కడ నుండి పక్కకి వెళ్ళిపోయాడు. తనీష్ కూడా ఈ గొడవని పెద్దది కానివ్వకుండా తన తమ్ముడిని అక్కడి నుండి తీసుకెళ్లిపోయాడు. ఇక క్రిష్ పక్కకి వెళ్లి తన అన్న తనీష్ తో కౌశల్ గురించి కాసేపు చర్చించాడు, నిజానికి కౌశల్ ని అడగాల్సినవి చాలా ఉన్నాయి అన్నయ్య.. ఒక్కటి కూడా అడక్కుండా వెళ్తే బాగుండదు అని ఈ ఒక్కటి అడిగాను. మీకు తెలుసో లేదో హౌస్ లో రెండో వారం వరకు కౌశల్ కి అంత సీన్ లేదు, ఎప్పుడైతే కిరీటి కౌశల్ విషయంలో రాంగ్ గా ప్రవర్తించాడో.. ఆ సింపతీ నుండి కౌశల్ కి ఫ్యాన్స్ పుట్టుకొచ్చారు. అంతే తప్ప అందులో కౌశల్ గొప్ప లేదు. ఎవరికీ ఉండే ఫ్యాన్స్ వాళ్ళకి ఉంటారు. నువ్వు జాగ్రత్తగా ఆడు అంటూ క్రిష్ తన్న అన్నకి జాగ్రత్తలు చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఎప్పుడు హౌస్ లో యాక్టివ్ గా ఉండే తనీష్ హౌస్ లోకి తన తమ్ముడు వచ్చే సరికి ఎమోషనల్ అయిపోయినట్టు కనిపించాడు. అందుకే తన తమ్ముడు చెప్పే మాటలను జాగ్రత్తగా వింటూ అలానే మౌనంగా ఉండిపోయాడు. ఏదేమైనా అన్నని చూడటానికి హౌస్ లోకి వచ్చిన క్రిష్ కౌశల్ తో గొడవ పడటంతో.. కౌశల్ ఫ్యాన్స్ అంతా అతని పై ఫైర్ అవుతున్నారు . 

Comments