Kaushal Wife In Bigg Boss House || హౌస్ లోకి వచ్చిన తనభార్య చేసింది చూసి కన్నీళ్ళు పెట్టుకున్న కౌశల్

          హౌస్ లోకి వచ్చిన తనభార్య చేసింది చూసి కన్నీళ్ళు పెట్టుకున్న కౌశల్

         బిగ్ బాస్ 2 హౌజ్ లో మోస్ట్ పాపులర్ కంటిస్టెంట్ ఎవరు అంటే ఖచ్చితంగా కౌశల్  పేరే వినిపిస్తుంది. అంతలా తన ఆట తీరుతో ప్రేక్షకుల హృదయాల్ని గెలిచాడు. కౌశల్ కి హౌజ్ లో ఉన్న వారి మనసుల్లో చోటు దక్కనప్పటికీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ అందరి మనసుల్లో చోటు దక్కింది. ఆ ఫ్యాన్సే కౌశల్ కి సపోర్ట్ చేస్తూ హైదరాబాద్ లో 2k రన్ నిర్వహించారు. దీంతో బిగ్ బాస్ కంటిస్టెంట్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బిగ్ బాస్ చరిత్రలోనే ఇటువంటి సంఘటన జరగలేదు, దాంతో బిగ్ బాస్ నిర్వాహకులు సైతం ఆశ్చర్యపోతున్నారట. కౌశల్ ఆర్మీ, పెయిడ్ ఆర్మీ అని అన్న వారంతా ఈ ర్యాలీని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. కౌశల్ ఆర్మీ పద్దతి చూస్తుంటే బిగ్ బాస్ 2 విన్నర్ గా కౌశల్ ని కాకుండా ఇంకెవరినైనా ఎంపిక చేస్తే సహించేలా లేరు అనిపిస్తుంది. అంతటి తీవ్ర ప్రభావం చూపిస్తున్నారు కౌశల్ ఆర్మీ. బిగ్ బాస్ షో ని శాసించే స్థాయిలో కౌశల్ ఆర్మీ ప్రభావం ఉందంటే, ఏ స్థాయిలో కౌశల్ ఆర్మీ పనిచేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ నిర్వాహకులు టాస్క్ లో భాగంగా తమ కుటుంబ సభ్యులని ఆహ్వానించి హౌజ్ మేట్స్ కి సర్ప్రైజ్ ఇచ్చారు. దీంతో వాతావరణం అంతా ఒక్కసారిగా ఎమోషనల్ గా మారిపోయింది. కౌశల్ భార్య నీలిమ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటరవ్వగానే కౌశల్ భావోద్వేగానికి లోనయ్యాడు. తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. భార్యని చూసిన ఆనందంలో ఇన్నాళ్ళు బిగ్ బాస్ హౌజ్ లో తాను పడిన కష్టమంతా కౌశల్ మర్చిపోయినట్టు తెలుస్తుంది.

          ఇక తన పిల్లల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని కంటతడి పెట్టాడు. ఈ సందర్భంగా నీలిమ కౌశల్ కి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. కౌశల్ అంటే బయట ఎలాంటి వాతావరణం నెలకొందో వివరించి చెప్పింది. కౌశల్ ఆర్మీ ఏర్పడడం నుంచి మొన్న జరిగిన 2k రన్ సంచలనం సృష్టించటం వరకూ అన్నీ పూస గుచ్చినట్టు వెల్లడించిందట.. దాంతో కౌశల్ మరింత భావోద్వేగానికి గురయ్యాడు. మీ పట్ల ఆడియన్స్ లో పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. ఫైనల్ వరకూ ఇలాగే కంటిన్యూ చేయగలిగితే మీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ నీలిమ తన భర్త కౌశల్ కి సలహా ఇచ్చింది. ఇతర కంటిస్టెంట్లు మిమ్మల్ని దూషించడం, ఇబ్బంది గురి చేయడాన్ని ప్రేక్షకులు సీరియస్ గా తీసుకుంటున్నారు. మీరు మాత్రం ఎవరి పట్ల పొరపాటు చేయద్దు, నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించండి. అదే మీకు శ్రీరామరక్ష అని కౌశల్ కి పలు సూచనలు చేసినట్లు తెలుస్తుంది.

 

Comments