రంగులు మారుస్తూ సైంటిస్టులకే షాక్ యిస్తోన్న వినాయకుడు| vinayaka Temple Mystery

           ఆరు నెలలకోసారి  రంగులు మార్చే వినాయక విగ్రహం... 

          తమిళనాడురాష్ట్రం   నాగర్ కోయిల్ జిల్లాలోని కేరళాపురం గ్రామంలో  అద్భుతమైన ఒక  వినాయక దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని అందరూ శ్రీ మహాదేవార్ అతిశయ వినాయగర్' ఆలయం అనిపిలుస్తుంటారు. ఈ ఆలయంలో  మూలవిరాట్టుగా  విఘ్నదేవుడైన వినాయకుడు కొలువైయున్నాడు.ఆ ఆలయంలోని ఆ వినాయక విగ్రహం ఆరు నెలలకు ఒకసారి రంగులు మారుతుంది.రెండున్నర దశాబ్దాలుగా ఈ విగ్రహం ఇలా రంగులు ఎందుకుమారుస్తుందో ఎవ్వరూ కనిపెట్టలేక పోయారు.. ఇదే అద్భుతం అనుకుంటే ఇక్కడ మరో అద్భుతం కూడా ఉంది. అదేమిటంటే,ఈ ఆలయం ఆవరణలో ఓ మంచి నీటి బావి ఉంటుంది. ఈ బావిలో నీళ్ళు కూడా రంగులు మారతాయి.  ఆ గుడిలోని వినాయకుడు తెల్లగా వున్నప్పుడు ఈ బావిలో నీళ్ళు నల్లగా మారతాయి. వినాయకుడు నల్లగా ఉన్నప్పుడు బావినీరు తెల్లగా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాదు ఈ ఆలయంలో వున్న మర్రిచెట్టు దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురిస్తూ అందరూ నోరెళ్లబెట్టేలా చేస్తుంది.   శ్రీ మహాదేవార్ అతిశయ వినాయగర్' ఆలయం   క్రీశ.12వ శతాబ్ది కాలం నాటిదని కొందరు చెబుతుండగా,ఈ ఆలయాన్ని  1317 లో  నిర్మించారని చరిత్రకారులు అంచనావేస్తున్నారు.. నిజానికిఈ ఆలయం  శివాలయం.కానీ దీన్ని అందరూ శ్రీ మహాదేవార్ అతిశయ వినాయగర్' ఆలయం అనే పిలుస్తుంటారు.ఈ ఆలయప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంటుంది.  ఆ తర్వాతే ఈ వినాయగర్ ఆలయం నిర్మించటం జరిగింది.

       అందుకే ఈ ఆలయాన్ని 'శ్రీ మహాదేవార్ అతిశయ వినాయగర్' ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయ నిర్మాణంవెనుక  ఒక చారిత్రక కథనం అక్కడ ప్రచారంలో ఉంది. అదేమిటంటే, ఆ రోజులలో కేరళాపురం' రాజుగారు తీర్థయాత్రలకనిచెప్పి, ‘రామేశ్వరం' వెళ్లడం జరిగింది. అక్కడ తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తుండగా,ఆ సముద్ర కెరటాలలో ఒక వినాయక విగ్రహం తడుస్తూ కనిపించింది. దాంతో ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి,  రాజుగారు   రామేశ్వరం రాజుగారికి అప్పగించబోతే.. దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మం' అని చెప్పి, రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని కేరళపురం' రాజుకే ఇస్తూ, మరొక మరకత అంటే పచ్చల గణపతిని కూడా బహుమతిగా యిచ్చాడు. కేరళపురం రాజుగారు ఆ రెండు విగ్రహాలనూ తన రాజ్యం తీసుకుని వచ్చి ప్రసుతం ఈ వినాయగర్ దేవాలయం ఉన్నచోటనే ప్రతిష్ఠించాడు.  అయితే తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతి కొల్లగొట్టబడి, ఈ రంగులుమార్చే గణపతి మాత్రం   అదృష్టం కొద్దీ ఇక్కడే మిగిలిపోయాడు.  ఇక్కడికొచ్చిన భక్తులు ఒక కోరిక కోరుకొని  ఈ స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపుమూట గానీ, ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది భక్తుల నమ్మకం.ఇలా  రంగులు మారుస్తూ ఉండే వినాయకుడు ఉన్న ఆలయం మన భారతదేశంలో  ఇదొక్కటే.

Comments