ram charan

RRR తాజా అప్డేట్‌

RRR తాజా అప్డేట్‌

రాజ‌మౌళి సినిమాలో యాక్ష‌న్ సీన్స్ ఓ లెవ‌ల్లో ఉంటాయ‌న్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. న‌చ్చే వ‌ర‌కు రాజీ ప‌డ‌ని జ‌క్క‌న్న ఆర్‌.ఆర్‌.ఆర్ యాక్ష‌న్ కోసం 15 రోజుల‌పాటు కేటాయించాడు. ట్రిపుల్ ఆర్‌లో హైలెట్‌గా నిలిచే ఓ ఫైట్‌ను రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌పై చిత్రీక‌రిస్తున్నాడు. చెర్రీ మ‌రో వైపు బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో విన‌య‌, విధేయ రామ చేస్తున్నాడు. 15వ తేదీ నుంచి జ‌రిగే నాన్ స్టాప్ షెడ్యూల్‌లో రామ్‌చ‌ర‌ణ్ పాల్గొన‌నున్నాడు. అంటే ఈ లోగా ట్రిపుల్ ఆర్ మొద‌టి షెడ్యూల్ పూర్త‌వుతుంద‌న్న‌మాట‌. 

అంద‌ర్నీ టార్గె చేసిన బోయ‌పాటి..!

అంద‌ర్నీ టార్గె చేసిన బోయ‌పాటి..!

రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న మూవీ విన‌య విధేయ రామ‌. రామ్ చ‌ర‌ణ్‌తో ఫ‌స్ట్ మూవీ కావ‌డంతో ఎలాగైనా హిట్ కాంబినేష‌న్ అనిపించుకునేందుకు బోయ‌పాటి ఒక‌టికి ప‌ది సార్లు ఆలోచిస్తున్నాడు. విన‌య విదేయ రామ అన్న టైటిల్ పెట్ట‌డంతో ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్స్ పెట్టే బోయ‌పాటి ఇంత సాఫ్ట్ టైటిల్ ఎందుకు ఎంచుకున్నాడు అన్న అనుమానం చాలా మందికి వ‌చ్చింది. ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ టీజ‌ర్‌తో వీళ్ల‌కు సాధానం చెప్పాడు. 

యాక్ష‌న్‌పై మ‌రింత ఫోక‌స్‌..!


యాక్ష‌న్‌పై మ‌రింత ఫోక‌స్‌..!

స్టార్ హీరోలు యాక్ష‌న్ మోడ్‌లోకి వెళ్లిపోతున్నారు. మాస్ మూవీస్‌తో ఎక్కువ‌గా హిట్స్ కొడుతున్న స్టార్‌లు ఇప్పుడు మాస్ ఇజాన్ని పీక్స్‌కు తీసుకెళుతూ బాక్సాఫీస్‌తో యుద్ధానికి దిగుతున్నారు. క‌త్తులు, గ‌న్‌ల‌తో సావాసం చేస్తున్నారు.  ప్ర‌భాస్, జూ.ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ఇలా వీరంతా ప్ర‌స్తుతం యాక్ష‌న్ సీన్స్‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నారు. భారీ ఫైట్ల‌తో బాక్సాఫీస్‌ను కుమ్మేయ్యాల‌ని ట్రై చేస్తున్నారు. 

రూమ‌ర్స్ న‌మ్మొద్దు..!

రూమ‌ర్స్ న‌మ్మొద్దు..!


బోయ‌పాటి, రామ్ చ‌ర‌ణ్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న చిత్రంపై వారం రోజులుగా చాలా రూమ‌ర్స్ పుట్టుకొస్తున్నాయి. సినిమా షూటింగ్ ఆల‌స్య‌మ‌వుతుంద‌ని, బోయపాటిపై రామ్ చ‌ర‌ణ్ సీరియ‌స్ అయ్యాడ‌ని సంక్రాంతికి రిలీజ్ క‌ష్ట‌మేన‌ని ప్ర‌చారం సాగింది. అయితే, ఆ రూమ‌ర్స్‌లో నిజం లేదంటున్నాడు నిర్మాత‌. సంక్రాంతికి మెగా ప‌వ‌ర్ స్టార్ బ‌రిలోకి దిగ‌డం ఖాయ‌మంటున్నాడు.

సినిమాకో డ్యాన్స్ స్టైల్‌ను ప‌రిచ‌యం చేస్తున్న స్టార్లు..!

సినిమాకో డ్యాన్స్ స్టైల్‌ను ప‌రిచ‌యం చేస్తున్న స్టార్లు..!

రామ్ సినిమా.. సినిమాకు కొంచెం కొత్త‌గా క‌నిపించాల‌ని ప్లాన్ చేస్తుంటాడు. క‌థ ఎలా ఉన్న‌ప్ప‌టికీ ప‌ర్ఫామెన్స్‌లో సంథింగ్ స్పెష‌ల్‌గా నిల‌వాల‌ని ట్రై చేస్తుంటాడు .ఇప్పుడు త్రినాథ్‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో తీస్తున్న హ‌లో గురూ ప్రేమ కోస‌మే సినిమాలో పాపింగ్ డ్యాన్స్ ను ట్రై చేశాడు రామ్‌. పెద్ద పెద్ద క‌ళ్ల‌తోటి ఈ పాట‌లో పాపింగ్ డ్యాన్స్ స్టైల్‌తో స్టెప్పులేశాడు. 

రామ్ చ‌ర‌ణ్‌, బోయ‌పాటి సినిమాకు టైటిల్ ఫిక్స్‌..!

                   ద‌స‌రాకు రానుంది రామ్ చ‌ర‌ణ్ మొద‌టి లుక్‌. చ‌ర‌ణ్ అబిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రామ్‌చ‌ర‌న్‌, బోయ‌పాటి సినిమా ఫ‌స్ట్ లుక్ ద‌స‌రా కానుక‌గా రానుంది. సంక్రాంతి బ‌రిలో నిలుస్తున్న ఈ సినిమా ప‌బ్లిసిటీ వెనుక‌బ‌డింద‌ని చ‌ర‌న్ అభిమానులు ఆందోల‌న‌ప‌డుతున్నారు. దాంతో ఇక ద‌స‌రాకు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయాల‌ని  ఫిక్స్ చేశాడు చ‌ర‌ణ్‌.