murder

జర్న‌లిస్టును 15 ముక్క‌లుగా చేసి.. ఆపై..!

జర్న‌లిస్టును 15 ముక్క‌లుగా చేసి.. ఆపై..!

అక్టోబ‌ర్ 2, 2018. ట‌ర్కీలోని సౌదీ అరేబియా రాయ‌బారి కార్యాల‌యం. ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ వ్య‌క్తిగ‌త ప‌నిమీద లోప‌లికి వెళ్లాడు. లోప‌లికి ఎంట‌ర్ అయిన కాసేప‌టి నుంచి అడ్ర‌స్ లేకుండాపోయాడు.  బ‌తికి ఉన్నాడో.. లేదో.. ఉంటే ఎక్క‌డ ఉన్నాడో ఎవ్వ‌రికీ తెలియ‌దు. కానీ, అత‌డ్ని క్రూరంగా చంపి, 15 ముక్క‌లు చేసి కాకుల‌కు, గ‌ద్ద‌ల‌కు వేశార‌ని తెలిసి ప్ర‌పంచం నివ్వెర‌పోయింది. నియంతృత్వ శ‌క్తులు త‌మ‌కు వ్య‌తిరేకంగా గొంతెత్తిన వారిని ఎలా అంతం చేయ‌గ‌ల‌వో మ‌రోసారి రుజువైంది. 

ఖమ్మంలో మ‌రో దారుణం..!

ఖమ్మంలో మ‌రో దారుణం..!
 

ఖ‌మ్మం ఎస్టీ వ‌స‌తి గృహంలో దారుణం జ‌రిగింది. ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్థి త‌న మిత్రుల‌తో క‌లిసి నాలుగో త‌ర‌గ‌తి వ‌ద్యార్థిని హ‌త్య చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఖానాపురంకు చెందిన జోస‌ఫ్ గిరిజ‌న ఆశ్ర‌మ పాఠ‌శాల‌లో నాల్గ‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. అదే హాస్ట‌ల్‌లో ఉంటూ మ‌రో స్కూల్లో ప‌ద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్థి ఇత‌నికి గొడ‌వ అయింది. ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ కాస్తా.. మాటా.. మాటా పెర‌గ‌డంతో పెద్ద‌దైంది. త‌న మిత్రుల‌ను వెంట‌నేసుకుని వ‌చ్చిన ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్థి నాలుగవ త‌ర‌గ‌తి విద్యార్థిని హ‌త్య చేశాడు.

ప్రాణ స్నేహితుడే కాల‌య‌ముడ‌య్యాడు..!

ప్రాణం తీసిన ప్రేమ వ్య‌వ‌హారం

ఇటీవ‌ల ప్రేమ వ్య‌వ‌హారంలో త‌లెత్తిన ఘ‌ర్ష‌ణ‌లో ఒక‌రిపై మ‌రొక‌రు పెట్రోలు పోసుకుని ఇద్ద‌రు యువ‌కులు మృతి చెందిన ఘ‌ట‌న‌ను మ‌రిచిపోక ముందే, జ‌గిత్యాల జిల్లాలో మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలిలా ఉన్నాయి. తాటిప‌ల్లి గ్రామానికి చెందిన న‌వీన్‌, బులిశెట్టి శ్ర‌వ‌ణ్ అనే ఇద్ద‌రు విద్యార్థులు డిగ్రీ చ‌దువుతున్నారు. అయితే, సోమ‌వారం రాత్రి న‌వీన్ నే విద్యార్థిపై బులిశెట్టి శ్ర‌వ‌ణ్ అనే విద్యార్థి క‌త్తితో దాడి చేశాడు. శ్ర‌వ‌ణ్ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ న‌వీన్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించినా ఫ‌లితం లేక‌పోయింద‌ని స్థానికులు చెబుతున్నారు.

ఆయేషా మీరా కేసును నీర్చుగార్చేందుకు సిట్ య‌త్నం..!

ఆయేషా మీరా కేసును నీర్చుగార్చేందుకు సిట్ య‌త్నం..!

ఆయేషా మీరా హ‌త్య కేసు ఏళ్ల‌త‌ర‌బ‌డి న‌లుగుతుంది. అయినా, కేసు ముందుకు క‌ద‌ల‌డం లేదు. కేసు ద‌ర్యాప్తుకు ప్ర‌త్యేక బృందాన్ని ఏపీ స‌ర్కారుకు ఏర్పాటు చేసినా ద‌ర్యాప్తు జ‌రుగుతున్న తీరుపై అనేక అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు ఆయేషా త‌ల్లిదండ్రులు. కాగా, శుక్ర‌వారం నాడు హైకోర్టులో ఈ కేసు విచారణ జ‌రిగింది.  ఇందుకు సిట్ బృందం చెప్పిన ఆన్స‌ర్ అక్క‌డ ఉన్న వారంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. 

విశాఖ జిల్లాలో దారుణ హ‌త్య‌

విశాఖ జిల్లాలో దారుణ హ‌త్య‌

విశాఖ జిల్లాలో దారుణం జ‌రిగింది. న‌క్క‌ప‌ల్లి మండ‌లం వేంపాడు టోల్ ప్లాజా వ‌ద్ద ఒక వ్య‌క్తిని కిరాత‌కంగా న‌రికి చంపారు కొంద‌రు గుర్తు తెలియ‌ని దుండ‌గులు. మృతుడు త‌మిళ‌నాడు మ‌ధురైకు చెందిన వీ.నీల‌మ‌గ అమ‌ర‌న్‌గా గుర్తించారు. త‌మిళ‌నాడు పోలీసుశాఖ‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వ‌హిస్తున్నాడు. కారులో వ‌చ్చిన ఎనిమిది మంది దుండ‌గులు నీల‌గ‌మ‌పై దాడికి పాల్ప‌డ్డ‌ట్టుగా ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు చెబుతున్నారు. అయితే, నీల‌మ‌గ అమ‌ర‌న్ ను దారుణంగా హ‌త్య చేసిన వారంత ఆకూడా గంజాయి వ్యాపారులుగా తెలుస్తుంది.

భ‌ర్త పుట్ట మూగ అని.. అక్ర‌మ సంబంధం పెట్టుకున్న భార్య ఏం చేసిందో తెలుసా..?


ఎక్క‌డ అక్ర‌మ సంబంధం ఉంటుందో.. అక్క‌డ ఓ మ‌ర‌ణం త‌ప్ప‌నిస‌రి అవుతుంద‌న్న మాట ఈ మ‌ధ్య గ‌ట్టిగా వినిపిస్తోంది. భార్యా భ‌ర్త‌ల్లో ఎవ‌రో ఒక‌రు వివాహేత ర‌సంబంధం ఆ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు ఘోర మ‌ర‌ణంపాల‌వుతున్నారు. ఇది గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా జ‌రుగతూ వ‌స్తున్న నిజం. తాజాగా, న‌ల్గొండ జిల్లా అడ్డ‌గూడూరు మండ‌లం మానాయికుంట గ్రామం ఓ ఘ‌ట‌న ఈ విష‌యం నిజ‌మనే విష‌యాన్ని తెలిపింది. 

వైసీపీ నేత దారుణ హ‌త్య‌..!

అనంత‌పురం జిల్లా రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో పాత క‌క్ష‌లు భ‌గ్గుమ‌న్నాయి. మాజీ స‌ర్పంచ్, వైఎస్ఆర్‌సీపీ నేత కేశ‌వ్‌రెడ్డిని కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రాళ్ల‌తో కొట్టి  దారుణంగా హ‌త్య చేశారు. అనంత‌పురం ఆస్ప‌త్రికి త‌ర‌లించే లోపే ఆయ‌న ప్రాణాల‌ను కోల్పోయారు.  అయితే, పాత త‌గాదాలే, ఈ హ‌త్య‌కు కార‌ణ‌మైన‌ట్టు తెలుస్తుంది.
 

జ‌ర్న‌లిస్టుపై అత్యాచారం.. ఆపై ఊపిరాడ‌కుండా చేసి హ‌త్య‌..!

మ‌హిళా జ‌ర్న‌లిస్టుపై ఓ గుర్తు తెలియ‌ని ముఠా అత్యాచారానికి పాల్ప‌డింది. ఆపై ఊపిరాడ‌కుండా చేసి జ‌ర్న‌లిస్టు ప్రాణాలు తీశారు. ఈ సంఘ‌ట‌న బ‌ల్గేరియాలో చోటు చేసుకుంది. సంఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలిలా ఉన్నాయి. బ‌ల్గేరియాకు చెందిన కాగా, బ‌ల్గేరియాలో ఓ ప్ర‌ముఖ టీవీ ఛానెల్‌లో రిపోర్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న మారినోవా అనే 30 సంవ‌త్స‌రాల మ‌హిళ గ‌త కొన్ని రోజులుగా బల్గేరియాకు వ‌స్తున్న స‌హాయ నిధుల్లో జ‌రుగుతున్న అక్ర‌మాల‌ను ఆధారాల‌తో స‌హా వెలుగులోకి తెస్తోంది.

ప్రేమ‌కు మ‌రో యువ‌కుడు బ‌లి..!

తెలుగు రాష్ట్రాల్లో ప్రేమికుల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఓ అమ్మాయిని ప్రేమించిన కుమార్ అనే యువ‌కుడిని కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్ జిల్లా వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతుంది. అయితే, కుమార్ త‌ర‌పు బంధువుల ఆందోళ‌న‌ల‌తో శంక‌ర్‌ప‌ట్ట‌ణం మండ‌లం తాడిక‌ల్లు గ్రామంలో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. 

చిన్నారి ప్రాణం తీసిన వివాహేత‌ర సంబంధం..!

మూడేళ్ల చిన్నారి దారుణ హ‌త్య‌..!

విశాఖ‌లో మూడేళ్ల చిన్నారి హ‌త్య తీవ్ర క‌ల‌క‌లం రేపుతుంది. చిన్నారి అలేఖ్య‌ను కొందరు దుండ‌గులు హ‌త్య చేసి దువ్వాడ పొద‌ల వ‌ద్ద ప‌డేశారు. త‌మ బిడ్డ క‌నిపించ‌డం లేదంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన ఆ త‌ల్లిదండ్రుల‌కు క‌డుపుకోతే మిగిలింది. త‌మ చిన్నారి క్షేమంగా తిరిగి వ‌స్తుంద‌ని అనుకున్న ఆ త‌ల్లిదండ్రులు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు.

త‌మ కూతురు అలేఖ్య క‌నిపించ‌డం లేదంటూ  త‌ల్లిదండ్రులు దువ్వాడ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఇంత‌లో అనుకోని ఘోరం జ‌రిగింది. కుటుంబ క‌ల‌హాలే అలేఖ్య హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు భావిస్తున్నారు.