telangana

ప్ర‌లోభాల ప‌ర్వంలో నేత‌లు..!

తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంతో ఇవాళతో క‌లిపి  మూడు రోజులే ఉండ‌టంతో అభ్య‌ర్థులు ఉరుకులు, ప‌రుగులు పెడుతున్నారు. ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు తెర వెనుక త‌మ ప్ర‌య‌త్నాల‌ను పూర్తిస్థాయిలో చేస్తున్నారు. త‌మ‌తోపాటు ప్ర‌చారంలో పాల్గొంటున్న వారిని మంచిగా చూసుకోవ‌డంతోపాటు ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు వ‌ల వేస్తున్నారు. స్థాయినిబ‌ట్టి బ‌హుమ‌తులిచ్చి మంచి చేసుకుంటున్నారు. 

ఓటు బ్యాంకు బ‌ద‌లాయింపుపై పార్టీల్లో టెన్ష‌న్‌

ఓటు బ్యాంకు బ‌ద‌లాయింపుపై పార్టీల్లో టెన్ష‌న్‌

జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏపీ ప్రాంత ఓట‌ర్లు కీల‌కంగా మారారు. అసెంబ్లీ సెగ్మెంట్ ప‌రిధిలో దాదాపు 20 శాతం మంది వారే ఉండ‌టం   ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపించ‌నుంది.  అందుకే జూబ్లీహిల్స్ టికెట్ త‌మ‌కే ఇవ్వాల‌ని టీడీపీ మొద‌ట్నుంచి పట్టుబ‌ట్టింది. అయితే, మాజీ ఎమ్మెల్యే విష్ణువ‌ర్ధ‌న్ తిరిగి కాంగ్రెస్ టికెట్‌ను ద‌క్కించుకుని ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లు పెట్టారు.

టీఆర్ఎస్ నేత హ‌త్య‌కు రెక్కీ..!

టీఆర్ఎస్ నేత హ‌త్య‌కు రెక్కీ..!

తెలంగాణ‌లో ఓ వైపు ఎన్నిక‌ల హ‌డావుడి కొన‌సాగుతుంటే, మరో వైపు మావోయిస్టుల క‌ద‌లిక‌లు ఉత్త‌ర తెలంగాణ జిల్లాల్లోని పాత వ‌రంగ‌ల్ జిల్లా ఖ‌మ్మం జిల్లా అట‌వీ ప్రాంతంలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇప్ప‌టికే ఈ ప్రాంతంలో మావోయిస్టుల సంచారాన్ని పోలీసులు ప‌సిగ‌ట్టారు.  ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడుల‌కు దిగేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు అనుమానిస్తున్నారు. 

Tags

ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన కేసీఆర్‌

తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్న క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు కాసేప‌టి క్రితం ముంద‌స్తు ఎన్నిక‌ల్లో భాగంగా గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామినేష‌న్‌ను దాఖ‌లు చేశారు. అంత‌కు ముందు కోనాయిప‌ల్లి ప్ర‌ముఖ దేవ‌స్థానం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. కేసీఆర్‌తోపాటు ఆప‌ద్ధ‌ర్మ మంత్రి హ‌రీశ్‌రావు కూడా స్ఆమివారిని ద‌ర్శించుకున్నారు.

కారులో ఎవ‌రు తిరిగినా.. స్టీరింగ్ ఎంఐఎం చేతిలోనే..!

కారులో ఎవ‌రు తిరిగినా.. స్టీరింగ్ ఎంఐఎం చేతిలోనే..!

రాజేంద్ర‌న‌గ‌ర్‌లో గెలుపు ఎంఐఎందేన‌ని ధీమా వ్య‌క్తం చేశారు అస‌దుద్దీన్ ఓవైసీ. నాలుగేళ్లు ఏమీ చేయ‌నివారు కారు వేసుకుని వ‌స్తున్నార‌ని, దాని స్టీరింగ్ మాత్రం త‌మ చేతుల్లోనే ఉంద‌ని ప‌రోక్షంగా టీఆర్ఎస్‌ను హెచ్చ‌రించారు. ఎంఐఎం ముక్త్ హైద‌రాబాద్ కాదు..  తెలంగాణ ముక్త్ బీజేపీ కావ‌డం ఖాయ‌మ‌ని అన్నారు ఎంఐఎం నేత అస‌దుద్దీన్ ఓవైసీ 

బీజేపీయేత‌ర కూట‌మి ఏర్పాటుపై చంద్ర‌బాబు దూకుడు..!

బీజేపీయేత‌ర కూట‌మి ఏర్పాటుపై చంద్ర‌బాబు దూకుడు..!

జాతీయ స్థాయిలో బీజేపీయేత‌ర కూట‌మి ఏర్పాటుకు స్పీడ్ పెంచిన  టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌ర్వాతి స్టెప్ వేయ‌బోతున్నాడు. బీజేపీకి వ్య‌తిరేకంగా జాతీయ స్థాయిలో అన్ని పార్టీల‌ను క‌లుపుకుని భారీ బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేస్తున్నాడు. ఇప్ప‌టికే త‌మ త‌మ రాష్ట్రాల్లో జాతీయ  స్థాయి నేత‌ల‌తో స‌భ‌లు పెట్టేందుకు ముందుకొచ్చాయి. దీంతో బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించే నాటికి వీలైన‌న్ని పార్టీల‌ను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు చంద్ర‌బాబు.  

పాపం.. సంగీత‌..!

పాపం.. సంగీత‌..!


భ‌ర్త చేతిలో అన్యాయానికి గురైన బోడుప్ప‌ల్ సంగీత ఇప్పుడు ఎలా ఉంది..? ఏం చేస్తోంది.?  భ‌ర్త శ్రీ‌నివాస్‌రెడ్డి ఎక్క‌డ ఉన్నాడు.  సంగీత త‌న కూతురుతో క‌లిసి సుమారు 60 రోజుల‌పాటు అలుపెర‌గ‌ని దీక్ష చేసినా ఆమెకు న్యాయం జ‌రిగిందా..? స‌ంగీత‌కు న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చిన మ‌హిళా సంఘాల నేత‌లు, ప్ర‌జా ప్ర‌తినిధులు ఏమ‌య్యారు. ఎవ్వ‌రు స‌హాయం చేసినా.. చేయ‌కోయినా బోడుప్పల్ సంగీత ఇంకా న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. కూతురుతోనే క‌లిసి అత్తారంటిలో ఉంటున్న భ‌ర్త మాత్రం అక్క‌డికి రావ‌డం లేదు. భ‌ర్త శ్రీ‌నివాస్‌రెడ్డి ఎక్క‌డ ఉంటున్నాడో కూడా ఆమెకు తెలియ‌డం లేదు.

వేధింపుల‌కు బ‌లి..!

వేధింపుల‌కు బ‌లి..!

హైద‌రాబాద్‌లో అనుమానాస్ప‌ద స్థితిలో ఓ వైద్యురాలి మృతి క‌ల‌క‌లం రేపుతోంది. భ‌ర్త, అత్త మామ‌ల వేధింపులే కార‌ణ‌మా..?  లేక ఇంకేమైనా కార‌ణాలు ఉన్నాయా..? ఈ కోణంలో లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు అల్వాల్ పోలీసులు.  మృతురాలి కుటుంబ స‌భ్యులు జ‌య‌శ్రీ మృతిపై చాలా అనుమానాల‌నే వ్య‌క్తం చేస్తున్నారు.