congress

కాంగ్రెస్‌లో చేరిన నిజామాబాద్‌ టీఆర్ఎస్ నేత‌లు..!

డిసెంబ‌ర్ 12వ తేదీన తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్ప‌డుతుంద‌ని టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన 30 మంది ఎంపీటీసీలు, 50 మంది మాజీ స‌ర్పంచ్‌లు కాంగ్రెస్‌లో చేరారు. గాంధీభ‌వ‌న్‌లో ఒక కార్య‌క్ర‌మంలో 50 మంది మాజీ స‌ర్పంచ్‌లు, 30 మంది ఎంపీటీసీల‌కు టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ కండువాలు క‌ప్పి పార్టీలోకి

విజ‌య‌శాంతికి త‌ప్పిన పెను ప్ర‌మాదం..!

విజ‌య‌శాంతికి త‌ప్పిన పెను ప్ర‌మాదం..!

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ముంద‌స్తు ఎన్నిక‌ల నిర్వ‌హించే తేదీని ప్ర‌క‌టించ‌డంతో తెలంగాణ‌లో రాజ‌కీయం వేడెక్కింది. దీంతో పార్టీల నేత‌లు ఎన్నిక‌ల ప్ర‌చారంలో అనుస‌రించాల్సిన వ్యూహాల‌ను, అలాగే, ప్ర‌త్య‌ర్ధుల‌పై సంధించాల్సిన అస్ర్తాల‌ను సిద్ధం చేసుకుంటున్నారు. అంతేకాకుండా, ప్ర‌చారాన్ని కూడా ముమ్మ‌రం చేశారు. ఇప్ప‌టికే టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ప్ర‌చారాన్ని ప్రారంభించ‌గా.. మ‌హాకూట‌మిగా ఏర్ప‌డ్డ టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ అభ్య‌ర్థుల జాబితా వెల్ల‌డించాల్సి ఉంది. ఇంకా అభ్య‌ర్థుల పేర్లు వెల్ల‌డించ‌క‌పోవ‌డంతో..

కేసీఆర్‌ను అన్నా అని పిలిచినందుకు సిగ్గుప‌డుతున్నా..చ్ఛి..చ్ఛీ.!

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల గ‌డువు ద‌గ్గ‌రప‌డుతున్న నేప‌థ్యంలో రాజ‌కీయ పార్టీల నేత‌లు ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశారు. సీఎం కేసీఆర్ పాల్గొన్న టీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డుతుంటే.. మ‌రో ప‌క్క  కేసీఆర్ స‌ర్కార్‌ను టార్గెట్ చేస్తూ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌ల‌ను తీవ్ర‌త‌రం చేశారు. ఇలా విమ‌ర్శ‌లు.. ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో తెలంగాణ రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. 

కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన నాదెండ్ల మ‌నోహ‌ర్‌..!


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడిప్పుడే పుంజుకుందామ‌నుకుంటున్న ఏపీ కాంగ్రెస్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ పార్టీని వీడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉనికిని నిల‌బెట్టుకోవాల‌ని చూస్తున్న కాంగ్రెస్‌కు నాదెండ్ల మ‌నోహ‌ర్‌ షాక్ ఇచ్చారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సైలెంట్‌గా త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన మ‌నోహ‌ర్ ప‌వ‌న్ స‌మ‌క్షంలో జ‌న‌సేన పార్టీలో చేర‌బోతున్నారు. 

కాంగ్రెస్‌లోకి ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్‌..!

ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ ఇవాళ కాంగ్రెస్‌లో చేర‌నున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో ఆయ‌న కాంగ్రెస్ కండువా క‌ప్పుకోనున్నారు. అయితే, గ‌జ్వేల్ నుంచి సీఎం కేసీఆర్‌పై గ‌ద్ద‌ర్ పోటీ చేయ‌నున్న‌ట్టు సమాచారం.  గ‌ద్ద‌ర్ కుమారుడు సూర్య కిర‌ణ్ గ‌త ఏప్రిల్‌లో కాంగ్రెస్‌లో చేరిన విష‌యం తెలిసిందే. సూర్య‌కిర‌ణ్ తెలంగాణ నుంచి లోక్ స‌భ స్థానానికి పోటీ చేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. 

టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ ఇంటిపై ఐటీ సోదాలు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌ళ్లీ ఐటీ దాడుల క‌ల‌క‌లం మొద‌లైంది. ఈ సారి రాజ్య‌స‌భ స‌భ్యుడు, తెలుగుదేశం నేత సీఎం ర‌మేష్ ఆస్తుల‌పై ఐటీ సోదాలు కొన‌సాగుతున్నాయి. సీఎం ర‌మేష్ కంపెనీలు, ఇళ్ల‌లో ఆదాయ‌పు ప‌న్నుశాఖ అధికారులు ఇవాళ ఉద‌యం నుంచి త‌నిఖీలు చేప‌ట్టారు. ఇటు హైద‌రాబాద్‌తోపాటు క‌డ‌ప‌లోని సీఎం ర‌మేష్ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేప‌ట్టారు.

మ‌హాకూట‌మిలో సీట్ల పంచాయితీ..!

మ‌హాకూట‌మిలో అప్పుడే లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయా..?  సీట్ల పంచాయితీతో మొద‌టికే మోసం వ‌చ్చిందా..?  కాంగ్రెస్ పెడుతున్న ష‌ర‌తులు మిగ‌తా పార్టీల‌కే  న‌చ్చ‌డం లేదా..? అంటే అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు మ‌హాకూట‌మి పార్టీల నేత‌లు. 

కాంగ్రెస్ లోకి గద్దర్? | Is Telangana Singer Gaddar Join in Congress? | Telangana Political Updates

           కాంగ్రెస్ లోకి గద్దర్?

          తెలంగాణ ఉద్యమం నడిపిచింది. కళాకారుల పాట లతో తెలంగాణ ను చెచుకుంది. ఆ పాటలే తెలంగాణ ఉద్యమం లో యువతకు బలాన్ని ఇచ్చింది. ఆ కళాకారుల పాటలే ఆ పాటలు పడిన గాయని గాయకు లు తెలంగాణ లో గుర్తింపును తెచుకోలేకపోయారు. కవులను వాడేసి వొదిలేసారు అని విమర్శలు వస్తున్నాయి. ఈసారి వారి పోరాటాలు కెసిఆర్ కుటుంబం పైన నే అని తెలంగాణ ఉద్యమం లో పోరాడిన గాయని గాయకు లు చెప్తున్నారు. ఉద్యమ కాలంలో గద్దర్ పోషించిన పాత్రా చెప్పుకోదగినది. అయన పాట లతో యువతలో పాల్గొనేలా చేసాయి. అంతే కాకుండా ఉద్యమ  వేడిని చాలారకుండా చేసాయి.