politics

టీ.కాంగ్రెస్ అభ్య‌ర్థుల జాబితా మ‌రింత ఆల‌స్యం..!

 

తెలంగాణ‌లో సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు ఒక్క‌టైన ప్ర‌తిప‌క్ష పార్టీలు కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, సీపీఎం, జ‌న స‌మితి ఇలా ప‌లు పార్టీలు మ‌హాకూట‌మిగా ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసిన వెంట‌నే త‌మ పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను దాదాపు 105 మందితో కూడిన జాబితాను విడుద‌ల చేసిన కేసీఆర్ ప్ర‌చార శంఖారావాన్ని కూడా ప్రారంభించారు. మ‌రో ప‌క్క మ‌హాకూట‌మి అభ్య‌ర్థుల లిస్టు మాత్రం ఇంకా వెల్ల‌డి కాలేదు.

Tags

ప‌వ‌న్, చిరంజీవిపై క‌ళ్యాణ్‌పై మంత్రి సోమిరెడ్డి ఫైర్‌..!

ఏపీ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి జ‌న‌సేన అధినేత, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఫైర‌య్యారు. కాగా, సోమ‌వారం నాడు ధ‌వ‌ళేశ్వ‌రం బ్రిడ్జీపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆధ్వ‌ర్యంలో జ‌న‌సేన క‌వాతు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ క‌వాతులో దాదాపు రెండు ల‌క్ష‌ల మందికి పైగా జ‌న సైనికులు పాల్గొన్న‌ట్టు స‌మాచారం. క‌వాతు ముగిసిన అనంత‌రం ఏర్పాటు చేసిన జ‌నసేన స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ ప్ర‌భుత్వంపై, అలాగే, సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

జ‌న‌సేనుని మ‌హా క‌వాతు

జ‌న‌సేనుని మ‌హా క‌వాతు

గోదావ‌రి సాక్షిగా చారిత్రాత్మ‌క ఘ‌ట్టం ఆవిష్కృతి కాబోతుంది. వివిధ వ‌ర్గాలు, యువ‌త‌, మ‌హిళల విశేష ఆద‌ర‌ణ‌తో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో జ‌న‌సేన పోరాట యాత్ర కొన‌సాగించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ తూర్పు గోదావ‌రి జిల్లాలో పోరాట యాత్ర‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన వాగ్ధానాలు, హామీలు, మేనిఫెస్టోలోని అంశాలు నెర‌వేర్చ‌లేద‌ని నిర‌సిస్తూ రాజ‌కీయ జ‌వాబుదారిత‌నంపై యువ‌త‌ను జాగృతం చేయ‌డానికి గోదావ‌రి సాక్షిగా క‌వాతుకు శ్రీ‌కారం చుట్టారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.  

కాంగ్రెస్‌లో చేరిన నిజామాబాద్‌ టీఆర్ఎస్ నేత‌లు..!

డిసెంబ‌ర్ 12వ తేదీన తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్ప‌డుతుంద‌ని టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన 30 మంది ఎంపీటీసీలు, 50 మంది మాజీ స‌ర్పంచ్‌లు కాంగ్రెస్‌లో చేరారు. గాంధీభ‌వ‌న్‌లో ఒక కార్య‌క్ర‌మంలో 50 మంది మాజీ స‌ర్పంచ్‌లు, 30 మంది ఎంపీటీసీల‌కు టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ కండువాలు క‌ప్పి పార్టీలోకి

విజ‌య‌శాంతికి త‌ప్పిన పెను ప్ర‌మాదం..!

విజ‌య‌శాంతికి త‌ప్పిన పెను ప్ర‌మాదం..!

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ముంద‌స్తు ఎన్నిక‌ల నిర్వ‌హించే తేదీని ప్ర‌క‌టించ‌డంతో తెలంగాణ‌లో రాజ‌కీయం వేడెక్కింది. దీంతో పార్టీల నేత‌లు ఎన్నిక‌ల ప్ర‌చారంలో అనుస‌రించాల్సిన వ్యూహాల‌ను, అలాగే, ప్ర‌త్య‌ర్ధుల‌పై సంధించాల్సిన అస్ర్తాల‌ను సిద్ధం చేసుకుంటున్నారు. అంతేకాకుండా, ప్ర‌చారాన్ని కూడా ముమ్మ‌రం చేశారు. ఇప్ప‌టికే టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ప్ర‌చారాన్ని ప్రారంభించ‌గా.. మ‌హాకూట‌మిగా ఏర్ప‌డ్డ టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ అభ్య‌ర్థుల జాబితా వెల్ల‌డించాల్సి ఉంది. ఇంకా అభ్య‌ర్థుల పేర్లు వెల్ల‌డించ‌క‌పోవ‌డంతో..

మ‌హాకూట‌మి ర‌హ‌స్య మంత‌నాలు.. !

మ‌హాకూట‌మి ర‌హ‌స్య మంత‌నాలు.. !


నీ పార్టీకెన్ని.. నా పార్టీకెన్ని. ఇదే తెలంగాణ మ‌హాకూట‌మిలో సీట్ల పంచాయ‌తీ. టీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా కూట‌మిగా ఏర్ప‌డ్డ మ‌హాకూట‌మిలో సీట్ల పంచాయ‌తీ తేల‌డం లేదు. కాంగ్రెస్‌, సీపీఐ, టీడీపీ, టీజేఎస్‌లు ప‌ట్టు వీడ‌టం లేదు. అన్ని పార్టీలు కూడా త‌మ త‌మ బ‌లాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ ఎక్కువ సీట్ల‌ను ఆశిస్తున్నాయి. 

టీ.కాంగ్రెస్ అభ్య‌ర్థుల జాబితా మ‌రింత ఆల‌స్యం..!

టీ.కాంగ్రెస్ అభ్య‌ర్థుల జాబితా మ‌రింత ఆల‌స్యం..!

తెలంగాణ‌లో సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు ఒక్క‌టైన ప్ర‌తిప‌క్ష పార్టీలు కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, సీపీఎం, జ‌న స‌మితి ఇలా ప‌లు పార్టీలు మ‌హాకూట‌మిగా ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసిన వెంట‌నే త‌మ పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను దాదాపు 105 మందితో కూడిన జాబితాను విడుద‌ల చేసిన కేసీఆర్ ప్ర‌చార శంఖారావాన్ని కూడా ప్రారంభించారు. మ‌రో ప‌క్క మ‌హాకూట‌మి అభ్య‌ర్థుల లిస్టు మాత్రం ఇంకా వెల్ల‌డి కాలేదు. అయితే, తాజా స‌మాచారం మేర‌కు, టీ.కాంగ్రెస్ అభ్య‌ర్థుల జాబితా మరింత ఆల‌స్య‌మ‌య‌యే అవ‌కాశం ఉద‌ని తెలుస్తుంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు చెప్ప‌గానే జ‌గ్గారెడ్డి కుమార్తె ఏం చెప్పిందో తెలుసా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌,.. సినిమాల‌కు, రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌తీ ఒక్క‌రూ ఇష్ట‌ప‌డే, గౌర‌వించే వ్య‌క్తి. అందుకు ప్ర‌ధాన కార‌ణం ఆయ‌న వ్య‌క్తిత్వ‌మేన‌ని చెబుతుంటారు ఆయ‌న అభిమానులు. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి స‌హాయం కోరిన ప్ర‌తీ ఒక్క‌రికీ.. లేదు, కాదు అని చెప్ప‌కుండా త‌న స‌హాయం చేయ‌డంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌ట ఉంటారు. ఆ వ్య‌క్తిత్వమే ఆయ‌న‌కు అశేష సంఖ్య‌లో అభిమానుల‌ను సంపాదించి పెట్టింది. 

ఈ నెల 12న ఓట‌ర్ల జాబితా విడుద‌ల చేయొచ్చు :హైకోర్టు

తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దును స‌వాల్ చేస్తూ మాజీ మంత్రి డీకే అరుణ‌తో పాటు శ‌శాంక్‌రెడ్డి వేసిన పిటిష‌న్‌పై హైకోర్టు తీర్పును రిజ‌ర్వులో పెట్టింది. ఈ నెల 12న ఓట‌ర్ల జాబితాను విడుద‌ల చేయొచ్చ‌ని సూచించింది. ఓట‌ర్ల జాబితాపై అఫిడ‌విట్ ను దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. ఓట‌ర్ల జాబితా పిటిష‌న్‌పై విచార‌ణ ఈ నెల 12కు వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

వైసీపీ నేత దారుణ హ‌త్య‌..!

అనంత‌పురం జిల్లా రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో పాత క‌క్ష‌లు భ‌గ్గుమ‌న్నాయి. మాజీ స‌ర్పంచ్, వైఎస్ఆర్‌సీపీ నేత కేశ‌వ్‌రెడ్డిని కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రాళ్ల‌తో కొట్టి  దారుణంగా హ‌త్య చేశారు. అనంత‌పురం ఆస్ప‌త్రికి త‌ర‌లించే లోపే ఆయ‌న ప్రాణాల‌ను కోల్పోయారు.  అయితే, పాత త‌గాదాలే, ఈ హ‌త్య‌కు కార‌ణ‌మైన‌ట్టు తెలుస్తుంది.