TDP

సీబీఐ అంటే చంద్ర‌బాబుకు భ‌యం :  జీవీఎల్‌

అవినీతి అధికారులు, అవినీతి ఎంపీల‌ను కాపాడేందుకే సీఎం చంద్ర‌బాబు నాయుడు సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకుంటున్నార‌ని బీజేపీ ఎంపీ జీవీఎల్ విమ‌ర్శించారు. అక్ర‌మార్కుల‌కు అండ‌గా ఉండేందుకే డీజీపీ, సీఎస్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నారు.  భార‌త రాజ్యాంగం క‌ల్పించిన ఆర్టిక‌ల్ 257 సీఎం చంద్ర‌బాబు నాయుడు తుంగ‌లోతొక్కి అవినీతి ప‌రుల‌కు అండ‌గా నిలుస్తున్నార‌ని జీవిఎల్ విమ‌ర్శించారు.

మ‌రోసారి హైద‌రాబాద్‌కు చంద్ర‌బాబు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు రేపు మ‌రో సారి హైద‌రాబాద్‌కు రానున్నారు. హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న త‌మ పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల త‌రుపున దాదాపు ఐదు రోజుల‌పాటు ప్ర‌చారం చేయ‌నున్నారు. 

అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న తేదీ ఖ‌రారు..!

అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న తేదీ ఖ‌రారు..!

తెలంగాణ‌లో బీజేపీ చీఫ్ అమిత్ షా టూర్ ఖ‌రారైంది.  ఈ నెల 25న మిత్ షా హైద‌రాబాద్‌కు రానున్నారు. అమిత్ షా ఏఏ స‌భ‌ల్లో పాల్గొంటారు. ఏఏ ప్రాంతాల్లో ప్ర‌చారం చేస్తార‌నేదానిపై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తాయంటున్నారు రాజ‌కీయ వ‌ర్గాలు. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ప‌లుమార్లు ప‌ర్య‌టించిన అమిత్ షా జిల్లాల్లో పార్టీ ప‌రిస్థితి, నేత‌ల తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ప‌ద్ధ‌తి మార్చుకోవాల‌ని, ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎత్తి చూపాల‌ని క్లాస్ పీకారు. 

టీడీపీ రెండో జాబితాపై కాంగ్రెస్‌లో లొల్లి..!

టీడీపీ రెండో జాబితాపై కాంగ్రెస్‌లో లొల్లి..!

 

తెలంగాణ మ‌హా కూట‌మిలో సీట్ల సిగ‌ప‌ట్లు రంగారెడ్డి జిల్లాలో కాక‌రేపుతున్నాయి. పైకి పొత్తంటూనే లోలోప‌ల ర‌గిలిపోతున్న ఆశావ‌హులు  ఎవరికి వారే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొంత మంది రెబ‌ల్‌గా బ‌రిలోకి దిగుతుంటే మ‌రికొంద‌రు సీట్ల కోసం త‌మ‌దైన స్టైల్లో లాబీయింగ్ చేస్తున్నారు. అభ్య‌ర్థుల అనుచ‌రుల ఆందోళ‌న శృతి మించ‌డం హైక‌మాండ్‌ల‌కు త‌ల‌నొప్పిగా మారింది.

Tags

శేరిలింగంప‌ల్లి టీడీపీ అభ్య‌ర్థి వెనిగ‌ళ్ల ఆనంద ప్ర‌సాద్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

శేరిలింగంప‌ల్లి టీడీపీ అభ్య‌ర్థి వెనిగ‌ళ్ల ఆనంద ప్ర‌సాద్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

వెనిగ‌ళ్ల‌ ఆనంద ప్ర‌సాద్‌, భ‌వ్య ఆనంద  ప్ర‌సాద్‌. ఇప్పుడు ఈ పేరు ఒక్క‌సారిగా తెలంగాణ రాజ‌కీయాల్లో తెర‌పైకి వ‌చ్చింది. ఇంత‌కీ ఈయ‌న ఎవ‌రు..?, ఈయ‌న బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి..? అన్న‌దే అటు కాంగ్రెస్‌లోనూ, ఇటు టీడీపీలోనూ జ‌రుగుతున్న చ‌ర్చ‌. శేరిలింగంప‌ల్లి సీటు కోసం ఎంతో పోటీ ఉన్నా అది ఆయ‌న‌కు ఎలా ద‌క్కింది..?  దీని వెనుక ఎవ‌రు ఉన్నార‌నే చ‌ర్చ అంత‌టా న‌డుస్తుంది. మ‌హాకూట‌మీలోని పార్టీల మ‌ధ్య సీట్ల స‌ర్దుబాటులో శేరిలింగంప‌ల్లి సీటు టీడీపీ నుంచి వెనిగ‌ళ్ల ఆనంద ప్ర‌సాద్‌కు ఖ‌రారు చేశారు.

జ‌గ‌న్ సీఎం అయితే.. ఇంటింటికీ కుళాయి :  జోగి రమేష్‌

జ‌గ‌న్ సీఎం అయితే.. ఇంటింటికీ కుళాయి :  జోగి రమేష్‌

కృష్ణా జిల్లా పెడ‌న మండ‌లం కాక‌ర్లలోని మూడు పంచాయ‌తీల్లో రావాలి జ‌గ‌న్ - కావాలి జ‌గ‌న్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. పెడ‌న నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య క‌ర్త జోగి ర‌మేష్ ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన న‌వ‌ర‌త్నాల‌ను వైఎస్ఆర్‌సీపీ నేత‌లు  ఇంటింటికీ వెళ్లి ప్ర‌చారం చేశారు. వైఎస్ జ‌గ‌న్ అధికారంలోకి రాగానే  ప్ర‌తీ పేద‌వాడికి ఇఝ‌ల్లు క‌ట్టిస్తామ‌ని,  ఇంటింటికీ కులాయి ఏర్పాటు చేస్తామ‌ని జోగి ర‌మేష్ హామీ ఇచ్చారు.

చ‌ర్చ‌కొస్తారా..? చెక్కేస్తారా..?

చ‌ర్చ‌కొస్తారా..? చెక్కేస్తారా..?


ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో బీజేపీ, టీడీపీ మ‌ధ్య స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్ల‌తో ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. తాడేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి విష‌యంలో ఈ రోజు మ‌ధ్యాహ్నం వెంక‌ట‌రామ‌న్న గూడెంలో మీడియా సాక్షిగా చ‌ర్చ‌కు రెండు పార్టీలు సిద్ధ‌మ‌య్యాయి. బుధ‌వారం రాత్రే టీడీపీ నేత ముళ్ల‌పూడి బాపిరాజును ఓ టీడీపీ కార్య‌క‌ర్త ఇంట్లో నిర్బంధించారు పోలీసులు.

Tags

జ‌గ‌న్ కేసులో సంచ‌ల‌నం.. తెర‌పైకి మ‌రో టెన్ష‌న్‌..!

జ‌గ‌న్ కేసులో సంచ‌ల‌నం.. తెర‌పైకి మ‌రో టెన్ష‌న్‌..!


ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌పై జ‌రిగిన దాడి కేసులో నిందితుడు నిందితుడు శ్రీ‌నివాస‌రావు త‌రుపున రెండు పిటిష‌న్ల‌ను దాఖ‌లు చేశారు. విశాఖ స్పెష‌ల్ కోర్టులో న్యాయ‌వాది స‌లీమ్ బెయిల్ పిటిష‌న్ వేశారు. దీంతోపాటు శ్రీ‌నివాస‌రావు మాన‌సిక ప‌రిస్థితిపై వైద్య స‌హాయం కోరుతూ మ‌రో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. బాధితుడికి రెండో, మూడు రోజుల్లో బెయిల్ మంజూరు అవుతుంద‌ని న్యాయ‌వాది స‌లీమ్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

కాంగ్రెస్‌తో క‌ల‌వ‌డం దారుణం..!

కాంగ్రెస్‌తో క‌ల‌వ‌డం దారుణం..!


ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తాను అధ్య‌క్షుడిగా ఉన్న టీడీపీ పార్టీని కాంగ్రెస్‌తో పొత్తు కుద‌ర్చుకోవ‌డం దారుణ‌మ‌ని ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ అన్నారు. కాగా, ఇవాళ విజ‌య‌వాడ‌లో జ‌రిగిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఇత‌ర రాజ‌కీయ పార్టీల‌తో పొత్తు పెట్టుకోకుండా టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది ఒక్క‌సారికూడా లేద‌న్నారు. 2004 ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీతో పొత్తుపెట్టుకుని అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు.. ఆత‌రువాత మాట మార్చి బీజేపీతో పొత్తుపెట్టుకుని చారిత్రాత్మ‌క త‌ప్పిదం చేశామంటూ మాట్లాడార‌న్నారు.