pan card

మీ ఆధార్, పాన్, ఓటర్ కార్డులను జిరాక్స్ తీస్తున్నారా? | Beware While Taking Xerox Of Aadhar Card

      మీ ఆధార్, పాన్, ఓటర్ కార్డులను జిరాక్స్ తీస్తున్నారా?

      మన వ్యక్తిగత సమాచారం బహిరంగ మార్కెట్లో బట్టబయలవుతోంది. మీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్.. చివరికి మీ సెల్ నెంబర్ కూడా కొందరికి సొమ్ము చేసి పెడుతోంది. దర్జాగా మన నుంచి సేకరించిన సమాచారాన్ని కొందరు సైబర్ నేరస్థులకు విక్రయిస్తున్న ఉదంతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇలా వివిధ ఏజెన్సీలు, సంస్థల నుంచి కార్డు హోల్టర్ల వివరాలు సేకరిస్తున్న సైబర్ నేరగాళ్లు ఏకంగా కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి, మాటల్లో పెట్టి మన ఖాతాలను లూటీ చేస్తున్నారు.