RRR తాజా అప్డేట్‌

ntr ram charan, rajamouli

RRR తాజా అప్డేట్‌

రాజ‌మౌళి సినిమాలో యాక్ష‌న్ సీన్స్ ఓ లెవ‌ల్లో ఉంటాయ‌న్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. న‌చ్చే వ‌ర‌కు రాజీ ప‌డ‌ని జ‌క్క‌న్న ఆర్‌.ఆర్‌.ఆర్ యాక్ష‌న్ కోసం 15 రోజుల‌పాటు కేటాయించాడు. ట్రిపుల్ ఆర్‌లో హైలెట్‌గా నిలిచే ఓ ఫైట్‌ను రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌పై చిత్రీక‌రిస్తున్నాడు. చెర్రీ మ‌రో వైపు బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో విన‌య‌, విధేయ రామ చేస్తున్నాడు. 15వ తేదీ నుంచి జ‌రిగే నాన్ స్టాప్ షెడ్యూల్‌లో రామ్‌చ‌ర‌ణ్ పాల్గొన‌నున్నాడు. అంటే ఈ లోగా ట్రిపుల్ ఆర్ మొద‌టి షెడ్యూల్ పూర్త‌వుతుంద‌న్న‌మాట‌. 


రామ్ చ‌ర‌ణ్ షిఫ్ట్‌ల వారీగా రెండు సినిమాల‌తో బిజీగా ఉంటే  చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డి షూట్‌లో ఉన్నాడు. సినిమా షూటింగ్ మ‌రికొద్ది రోజుల్లో మైసూర్‌లో జ‌ర‌గోబోతుంది. ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి చిరంజీవి బ్రిటీష‌ర్స్‌తో పోరాడే సీన్‌ల‌ను తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నాడు.

నిన్న‌టి వ‌ర‌కు సొంత మ‌ల్టీప్లెక్స్ ఎంఎంబీ ఓపెనింగ్‌తో గ‌డిపేసిన మ‌హేష్ ప్ర‌స్తుతం పూజా హెగ్దేతో క‌లిసి ఆడిపాడుతున్నాడు. మ‌హేష్ 25వ సినిమా మ‌హ‌ర్షి షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. 
ఇక ప్ర‌భాస్ అయితే సాహో కోసం ఫిల్మ్ సిటీలో యాక్ష‌న్ సీన్స్‌లో బిజీ.. బిజీగా ఉన్నాడు. అలాగే, బాల‌కృష్ణ విష‌యానికొస్తే, తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం ఎన్టీఆర్ షూటింగ్‌క ఉగ్యాప్ ఇచ్చిన బాల‌య్య మ‌ళ్లీ సెట్స్‌పైకి రానున్నారు. ఈ లోగా ఖాళీగా లేకుండా ఉండేందుకు బాల‌య్య లేని సీన్స్‌ను చిత్రీక‌రిస్తున్నాడు క్రిష్‌. 
 

Comments