సామాజిక నేప‌థ్యంలో..

rajani kanth, prabhas


ఒకే దారిలో ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌..!

2.వో సెట్స్‌పై ఉండ‌గానే క‌బాలి చేశాడు ర‌జ‌నీ. క‌బాలి పూర్తి కాగానే కాలాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి, ఆ సినిమా విడుద‌లైన రోజునే కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో పేటా మొద‌లు పెట్టాడు. 2.ఓ రీసెంట్‌గా రిలీజ్ కాగా సంక్రాంతికి పేటా రిలీజ‌వుతుంది. పేటా రిలీజ‌య్యేలోగా మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తూ యంగ్ హీరోల‌కంటే స్పీడ్‌గా దూసుకుపోతున్నాడు ర‌జ‌నీకాంత్‌. 

ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లో వ‌స్తాడా..?  రాడా..? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం దొరికింది. వ‌స్తాన‌ని చెప్పినా.. వ‌రుస సినిమాలు చేస్తుండ‌టంతో మ‌ళ్లీ వెన‌క‌డుగు వేశాడా..? అన్న డౌట్ కొంత మందికి వ‌చ్చింది. అయితే, రాజ‌కీయ ప్ర‌స్థానానికి ఉపయోగ‌ప‌డేలా సినిమాను డిజైన్ చేసుకున్నాడు ర‌జ‌నీ. త‌న‌దైన స్టైల్‌ను ప‌క్క‌న‌పెట్టేసి సామాజిక నేప‌థ్యంలో సాగే క‌థ‌ను రెడీ చేస్తున్నాడ‌ట. ఇలాంటి చిత్రాల‌ను తీయ‌డంలో ధిట్టైన ముర‌గ‌దాస్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తాడ‌న్న‌ది కోలీవుడ్ టాక్‌.

ఈ విష‌యంలో క‌మ‌ల్ హాస‌న్ ర‌జ‌నీకాంత్ కంటే ఓ అడుగు ముందే ఉన్నాడు. సోష‌ల్ కాస్ కోసం సినిమాలు తీసే శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భార‌తీయుడు -2 మొద‌లు పెట్టేశాడు. ఈ ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ ఇప్పుడు ఏ సినిమా చేసినా త‌మ పొలిటిక‌ల్ ఎంట్రీకి యూస్ అయ్యే క‌థ‌ల‌తోపాటు ఇందులో పండిపోయిన ద‌ర్శ‌కుల‌నే ఎంచుకున్నారు. 

Comments