కోమ‌టిరెడ్డికి మ‌ద్ద‌తుగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌చారం..!

ravibabu

తెలంగాణ ఎన్నిక‌ల గ‌డువు త‌రుముకొస్తుండ‌టంతో ఎమ్మెల్యే అభ్య‌ర్థుల త‌రుపున బంధువులు కూడా ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. త‌మ బంధువుల‌నే ఎమ్మెల్యేగా గెలిపించాల‌ని ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేస్తున్నారు. కేవ‌లం త‌మ బంధువుల‌నే కాకుండా, త‌మ‌కు తెలిసిన సినీ ఇండ‌స్ట్రీ వారిని కూడా ప్ర‌చార రంగంలోకి దింపుతున్నారు అభ్య‌ర్థులు. ఇప్పుడు ఆ కోవ‌లో మొద‌టి స్థానంలో ఉంది కూక‌ట్‌ప‌ల్లి మ‌హాకూట‌మి ఎమ్మెల్యే అభ్య‌ర్థి సుహాసిని. నంద‌మూరి కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సుహాసినికి మ‌ద్ద‌తుగా ఇప్ప‌టికే నంద‌మూరి బాల‌కృష్ణ‌, నంద‌మూరి తార‌క ర‌త్న‌, ఇలా ప‌లువురు నంద‌మూరి కుటుంబ స‌భ్యులు ఎన్నిక‌ల ప్ర‌చార రంగంలోకి దిగిన సంగ‌తి తెలిసిందే.

అలాగే, టీడీపీ అభ్య‌ర్థి నామా నాగేశ్వ‌ర‌రావు త‌రుపున సినీ న‌టుడు తొట్టెంపూడి వేణు సైతం ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఇలా సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌చారం నిర్వ‌హిస్తు ఎన్నిక‌ల‌ను మ‌రింత హీటెక్కిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ద‌ర్శ‌కుడు ర‌విబాబు కూడా వ‌చ్చి చేశారు. న‌ల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచిన కోమ‌టిరెడ్డికి మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. కోమ‌టిరెడ్డి గెలుపు న‌ల్గొండ ప్ర‌జ‌ల అభివృద్ధికి మ‌లుపు అంటూ నినాదాలు చేస్తూ ప్ర‌చారాన్ని ర‌క్తి క‌ట్టించారు. 
 

Comments