సోనియా గాంధీ, కేసీఆర్ మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ ఏమిటో తెలుసా..?

kcr, sonia gandhi

ఎన్నిక‌ల గ‌డువు ముంచుకొస్తుండ‌టంతో పార్టీల నేత‌లు ప్ర‌చార హోరును ముమ్మ‌రం చేశారు. పార్టీల త‌రుపున స్టార్ క్యాంపెయిన‌ర్‌లుగా నియ‌మించ‌బ‌డ్డ వారంతా తీర‌క లేకుండా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. వారి వారి పార్టీల త‌రుపున ప్ర‌చారం నిర్వ‌హిస్తూ ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన‌ర్ విజ‌యశాంతి కూడా మంగ‌ళ‌వారం నాడు సూర్యాపేట‌లో నిర్వ‌మించిన కాంగ్రెస్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. 

నాడు సోనియా గాంధీ తెలంగాణ ప్ర‌క‌ట‌న‌ను చేయ‌క ముందు రాష్ట్రం ఏర్ప‌డ్డాక త‌న‌నే ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాల‌ని కేసీఆర్ కోరార‌ని, ఆ స‌మ‌యంలో నీవు వ‌ద్దు.. నీ పార్టీ వ‌ద్దంటూ సోనియా గాంధీ కేసీఆర్‌ను వెల్ల‌గొట్టార‌ని విజ‌య‌శాంతి గ‌ర్తు చేశారు. టీఆర్ఎస్‌ను గెలిపిస్తే ద‌ళితుడిని ముఖ్య‌మంత్రి చేస్తాన‌న్న కేసీఆర్‌.. తానెందుకు ముఖ్య‌మంత్రి ప‌ద‌విని చేప‌ట్టారో ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికైనా చెప్పాల‌ని ప్ర‌శ్నించారు విజ‌య‌శాంతి.

Comments