రేవంత్ రెడ్డి విడుదల, కొడంగల్ కు తరలించిన పోలీసులు

Revanath Reddy release, police moved to Kodungal

         రేవంత్ రెడ్డి విడుదల, కొడంగల్ కు తరలించిన పోలీసులు


       కాంగ్రెస్ వర్కింగ్  ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు  ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే అయితే కొద్దీ సేపటి క్రితం జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటరు నుంచి భారీ భద్రత మధ్య  రేవంత్ రెడ్డిని  కొడంగల్‌కు తరలించిన పోలీసులు అయితే ఈ రోజు ఉదయం 4 గంటల సమయంలో రేవంత్ రెడ్డి ని   జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్   పోలీసులు తీసుకొనివచ్చారు . అయితే అతనిని సుమారు 12 గంటలపాటు నిర్భందించారు.  అంతకు ముందు రేవంత్ ను వదిలి పెట్టాలి అని  రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్  రాష్ట్ర డిజిపి ని ఆదేశించారు. అయితే రేవంత్ స్టార్ క్యాంపెయినర్ కావడం తో అయినా ఎక్కడైనా ప్రచారం చేసుకునే అవకాశము ఉందని తెలిపారు. రజత్ కుమార్  అయితే రేవంత్ రెడ్డిని విడుదల చేయాలి అనడం తో  విడుదల చేసి భారీ భద్రత మధ్య  రేవంత్ రెడ్డిని కొడంగల్ తరలించారు. 

Comments