రేవంత్‌రెడ్డిని చూస్తే.. కేసీఆర్‌కి వ‌ణుకు..!

kcr, revanth

రేవంత్‌రెడ్డిని చూస్తే.. కేసీఆర్‌కి వ‌ణుకు..!

తెరాస అధినేత‌, తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు త‌న ప్ర‌భుత్వ కాలం ముగియ‌క ముందే ర‌ద్దు చేసిన‌ప్పుడే తెరాస ఓట‌మి ఖాయ‌మైంద‌ని ఏపీ పీసీసీ చీఫ్ ర‌ఘువీరారెడ్డి అన్నారు. కాగా, ఇవాళ  కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కాసేప‌టి క్రితం విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. ఇదే విష‌య‌మై ర‌ఘు వీరారెడ్డి మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

ఎన్నిక‌ల్లో ఓట‌మి భ‌యంతోనే తెరాస  రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయించింద‌న్నారు. తెలంగాణ వ్యాప్తంగా తెరాస స‌ర్కార్‌పై తీవ్ర స్థాయిలో వ్య‌తిరేక‌త ఏర్ప‌డింద‌ని, కేవ‌లం కేసీఆర్ కుటుంబ స‌భ్యులు త‌ప్ప మ‌రెవ్వ‌రు కూడా టీఆర్ఎస్‌కు ఓటు వేసే ప‌రిస్థితి తెలంగాణ‌లో క‌నిపించ‌డం లేద‌న్నారు ర‌ఘువీరారెడ్డి. ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకునేందుకు ఒక్కొక్క‌రికి రూ.15 కోట్ల చొప్పున కేసీఆర్ ఖ‌ర్చు పెడుతున్నార‌ని, ఆ న‌గ‌దునంతా 108, మీడియా వాహ‌నాల్లో పంపుతుంటే పోలీసులు ప‌ట్టించుకోక‌పోవ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు ర‌ఘువీరారెడ్డి.

Comments