అంద‌ర్నీ టార్గె చేసిన బోయ‌పాటి..!

ram charan, boyapati

అంద‌ర్నీ టార్గె చేసిన బోయ‌పాటి..!

రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న మూవీ విన‌య విధేయ రామ‌. రామ్ చ‌ర‌ణ్‌తో ఫ‌స్ట్ మూవీ కావ‌డంతో ఎలాగైనా హిట్ కాంబినేష‌న్ అనిపించుకునేందుకు బోయ‌పాటి ఒక‌టికి ప‌ది సార్లు ఆలోచిస్తున్నాడు. విన‌య విదేయ రామ అన్న టైటిల్ పెట్ట‌డంతో ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్స్ పెట్టే బోయ‌పాటి ఇంత సాఫ్ట్ టైటిల్ ఎందుకు ఎంచుకున్నాడు అన్న అనుమానం చాలా మందికి వ‌చ్చింది. ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ టీజ‌ర్‌తో వీళ్ల‌కు సాధానం చెప్పాడు. 

విన‌య విధేయ రామ టీజ‌ర్ యాక్ష‌న్ ఎపిసోడ్‌తో మొద‌లైంది. బోయ‌పాటి సినిమాలో ఇలాంటి సీన్స్ కామ‌నే అనుకునేలోగా తందానే అంటూ ఫ్యామిలీ సాంగ్స్‌ను రిలీజ్ చేసి సినిమాను యాక్ష‌న్ ఫ్యామిలీ డ్రామాగా మార్చేశాడు బోయ‌పాటి. 

టైటిల్ ఏమో సాఫ్ట్. టీజ‌రేమో యాక్ష‌న్‌. లేటెస్ట్‌గా ఫ్యామిలీ సాంగ్ విన‌య విధేయ రామ‌లో లేనిది లేదు. అన్నీ ఉన్నాయ‌ని చెప్ప‌క‌నే చెప్పేస్తున్నాడు బోయ‌పాటి త్వ‌ర‌లో రాబోయే ట్రైల‌ర్‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ కూడా పెట్టి డ్యూయ‌ట్‌సాంగ్‌ను రిలీజ చేస్తే సంపూర్ణ‌మ‌వుతుంది. తందానే పాట‌ను శ్రీ‌మణి రాయ‌గా ఎంఎల్ఆర్ కార్తికేయ‌న్ ఆల‌పించారు. 
 

Comments