యూత్‌ను ఆక‌ట్టుకుంటున్న క‌ల్లోలం సాంగ్‌

sharvananda

ఇంకో 28 రోజుల్లో 2018కి గుడ్‌బై చెప్పేస్తాం. ఇంత వ‌ర‌కు శ‌ర్వానంద్ క‌నిపించ‌లేదు. ఇయ‌ర్ ఎండింగ్‌కు ప‌ది రోజుల ముందు ఈ నెల 21న ప‌డి ప‌డి లేచే మ‌న‌సుతో వ‌స్తున్నాడు. క్రేజీ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి ప‌ల్ల‌వితో జ‌త క‌డుతూ హ‌నురాఘ‌వ‌పూడి  ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు శ‌ర్వా. 

ప‌డి.. ప‌డి.. లేచె మ‌న‌సు. టైటిల్ వింటే ల‌వ్ స్టోరీ అని ఇట్టే అర్థ‌మైపోతుంది. టీజర్ చూశాక యూత్‌ను టార్గెట్ చేసేలా సినిమా ఉంటుంద‌ని క‌న్ఫాం అయిపోయింది. రిలీజైన రెండు పాట‌ల‌ను చూస్తుంటే ఫీల్‌గుడ్ మూవీ అన్న సంకేతం ఇచ్చాడు హ‌ను రాఘ‌వ‌పూడి.

డైరెక్ట‌ర్ లాస్ట్ హిట్ కృష్ణ గాడి వీర ప్రేమ గాదకు మ్యూజిక్ ఇచ్చిన వివాల్ చంద్ర‌శేఖ‌ర్‌ను రిపీట్ చేశాడు ద‌ర్శ‌కుడు.  క‌ల్లోలం వెంటేసుకొచ్చే పిల్ల‌గాలే అంటూ రిలీజైన లేటెస్ట్ సాంగ్‌ను కృష్ణ‌కాంత్ రాయ‌గా అనురాగ్ కుల‌కర్ణి ఆల‌పించారు. ఆ మ‌ధ్య విడుద‌లైన టైటిల్ సాంగ్‌ను కూడా కృష్ణ‌కాంత్ ర‌చించారు. మొత్తానికి టీజ‌ర్‌, సాంగ్స్‌తో ఫీల్‌గుడ్ మూవీ అన్న మార్క్ వేసి ఈ ప‌డి ప‌డి లేచె మ‌న‌సు యూత్‌ను టార్గెట్ చేస్తుంది. 

 

https://www.youtube.com/watch?v=ZpjHCr3san0

Comments