నారా లోకేష్ గ‌న్నేరు ప‌ప్పు అని రుజువైంది..!

chandrababu naralokesh roja

ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల‌కు ప‌నికిరాని గ‌న్నేరు ప‌ప్పు అంటూ నారా లోకేష్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఎందుకు ప‌నికిరాని లోకేష్కు మంత్రి ప‌ద‌వి ఇచ్చిన చంద్ర‌బాబు పుత్ర ప్రేమ‌ను చాటుకున్నార‌ని అన్నారు. 


ఈ రోజు నీ కొడుకు ఏపీలోనే కాదు.. తెలంగాణాలో కూడా ప‌నికిరాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప‌నికిరాని గ‌న్నేరు ప‌ప్పు నారా లోకేష్ అని చంద్ర‌బాబు నాయుడే ఒప్పుకున్నార‌న్నారు. ఎందుకంటే.. ప్ర‌చారానికి పంపించ‌కుండా.. ఆఖ‌ర‌కు ఎన్నిక‌ల్లో పోటీ చేసుందుకు నిల‌బెట్ట‌కుండా చంద్ర‌బాబు నారా లోకేష్ అస‌మ‌ర్ధ‌త‌ను బ‌య‌ట‌పెడుతున్నార‌న్నారు. కానీ, ప‌ద‌వులు, క‌మీష‌న్‌లు, కాంట్రాక్టులు నారా ఫ్యామిలీకి.. పని చేసేందుకు మాత్రం నంద‌మూరి ఫ్యామిలీ కావాల్నా..? అని ఎమ్మెల్యే రోజా ప్ర‌శ్నించారు. 

Comments