సీబీఐ అంటే చంద్ర‌బాబుకు భ‌యం :  జీవీఎల్‌

chandrababu gvl bjp telugu desam party

అవినీతి అధికారులు, అవినీతి ఎంపీల‌ను కాపాడేందుకే సీఎం చంద్ర‌బాబు నాయుడు సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకుంటున్నార‌ని బీజేపీ ఎంపీ జీవీఎల్ విమ‌ర్శించారు. అక్ర‌మార్కుల‌కు అండ‌గా ఉండేందుకే డీజీపీ, సీఎస్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నారు.  భార‌త రాజ్యాంగం క‌ల్పించిన ఆర్టిక‌ల్ 257 సీఎం చంద్ర‌బాబు నాయుడు తుంగ‌లోతొక్కి అవినీతి ప‌రుల‌కు అండ‌గా నిలుస్తున్నార‌ని జీవిఎల్ విమ‌ర్శించారు.


సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌జ‌ల‌ప‌ట్ల రాజ్యాంగంప‌ట్ల ఏ మాత్రం బాధ్య‌త వ‌హించ‌కుండా అవినీతిని, అక్ర‌మార్కుల‌ను, తెదేపాలో ఉండి లూఠీ చేసే వారు ప‌న్నులు క‌ట్ట‌కుండా ఎగ్గొట్ట‌డం, బ్యాంకు రుణాల‌ను ఎగ్గొట్ట‌డం, ఇటువంటి అక్ర‌మాలు చేసి వారంద‌ర్నీ కాపాడ‌టం కోసం సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వ‌మంటూ చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకోవ‌డం దారుణ‌మ‌న్నారు. 

Comments