రోబో 2.O అక్కడ పెద్దగా ఆడట్లేదట..కలెక్షన్లు నిల్

Robot 2.O There are no big players no Collections nil

               రోబో 2.ఓ అక్కడ పెద్దగా ఆడట్లేదట..కలెక్షన్లు నిల్ 
 

         భారీ అంచనాల మధ్య, అత్యంత భారీ బడ్జెట్ తో రిలీస్ అయిన రజనీ రోబో 2.ఓ, ప్రపంచ వ్యాప్తంగా  దూసుకుపోతోంది...మొదటి రెండు రోజుల కలెక్షన్ లు బహుబలిని మిచి పోయేలా ఉన్నాయి...మరోవైపు ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు... ఇక ఇది ఇలా ఉంటె అక్కడ మాత్రం రోబో 2.ఓ పెద్దగా ఆడట్లేదట...దాదాపు ఈ సినిమాలో అందరూ నేషనల్ స్టార్స్ ఉన్నారు అయినా అక్కడ మాత్రం కలెక్షన్ల పరంగా ముందుకు వెళ్ళడం లేదు... కాసుల వర్షం కురుస్తుంది అని అనుకున్న చోటే ఇలా అవ్వడం మూవీ యోనిట్ ని ఆలోచనలో పడేసింది.....అదే బాలివుడ్ అవును బాలివుడ్ లో హిందీ వర్షన్ లో ఈ సినిమా పెద్దగా ఆడటం లేదని టాక్ వినిపిస్తోంది. 

         నిజంగానే అక్ష‌య్ కుమార్ అభిమానులు సినిమాపై కోపంగా ఉన్నారా.. ఇదే హిందీ వ‌సూళ్ల‌పై ప్ర‌భావం చూపిస్తుందా..? ఏమో ఇప్పుడు ఇవే అనుమానాలు వ‌స్తున్నాయి బ‌య‌ట కూడా. ఎందుకంటే "2.0" సినిమాకు ఊహించిన స్థాయిలో వ‌సూళ్లు రావ‌డం లేదు.  సెకండాఫ్‌లో కానీ అక్ష‌య్ కుమార్ రాక‌పోవ‌డం.. వ‌చ్చినా విల‌న్ రోల్ కావ‌డం.. స్క్రీన్ ప్ర‌జెన్స్ కూడా త‌క్కువ‌గానే ఉండ‌టంతో ఖిలాడీ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. 500 కోట్ల బ‌డ్జెట్ తో వ‌చ్చిన సినిమాకు తొలిరోజే క‌నీసం 50 కోట్ల షేర్ కూడా రాలేదంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. అక్కడ అక్షయ్ కుమార్ ఉన్నా కూడా ఎందుకో కానీ వసూళ్లు రావడం లేదు.

        అటు ర‌జినీకాంత్ ఫ్యాన్స్ తో పాటు ఇటు అక్ష‌య్ కుమార్ ఫ్యాన్స్ కూడా హ‌ర్ట్ అవుతున్నారు. సెకండాఫ్‌లో కానీ అక్ష‌య్ కుమార్ రాక‌పోవ‌డం.. వ‌చ్చినా విల‌న్ రోల్ కావ‌డం.. స్క్రీన్ ప్ర‌జెన్స్ కూడా త‌క్కువ‌గానే ఉండ‌టంతో ఖిలాడీ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అక్ష‌య్ కుమార్ ఉన్నాడ‌నే ధైర్యంతోనే హిందీలో 77 కోట్లకు కొన్నారు ఈ చిత్రాన్ని. అయితే తొలిరోజు అక్క‌డ క‌నీసం 10 కోట్లు కూడా రాక‌పోవ‌డంతో షాక్ అవ్వ‌డం నిర్మాత‌ల వంత‌యింది.

          రెండోరోజు కూడా వ‌సూళ్లు ఊహించిన‌ట్లుగా అయితే లేవు. కంటెంట్ వీక్‌గా ఉండ‌టానికి తోడు.. అక్ష‌య్ కుమార్ పాత్ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌టం.. విజువ‌ల్స్ త‌ప్ప విష‌యం లేక‌పోవ‌డంతో "2.0" క‌లెక్ష‌న్ల వేట‌లో వెన‌క‌బ‌డింది. అయితే 3డి వ‌ర్ష‌న్ మాత్రం ఇప్ప‌టికీ దున్నేస్తుంది. అయితే అది మాత్రమే ఎంత‌వ‌ర‌కు కాపాడుతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. మరి ఈ సమస్యను అక్షయ్ ఎలా ఎదుర్కుంటాడో వేచి చూడాలి...దాదాపు 2 వేల కోట్లు టార్గెట్ పెట్టకున్న ప్రోస్యూసర్స్ ని ఈ వార్త ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది...

Comments