ప్ర‌లోభాల ప‌ర్వంలో నేత‌లు..!

policians,

తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంతో ఇవాళతో క‌లిపి  మూడు రోజులే ఉండ‌టంతో అభ్య‌ర్థులు ఉరుకులు, ప‌రుగులు పెడుతున్నారు. ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు తెర వెనుక త‌మ ప్ర‌య‌త్నాల‌ను పూర్తిస్థాయిలో చేస్తున్నారు. త‌మ‌తోపాటు ప్ర‌చారంలో పాల్గొంటున్న వారిని మంచిగా చూసుకోవ‌డంతోపాటు ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు వ‌ల వేస్తున్నారు. స్థాయినిబ‌ట్టి బ‌హుమ‌తులిచ్చి మంచి చేసుకుంటున్నారు. 

కొన్ని చోట్ల నేత‌ల‌కు ద‌క్షిణ‌తోపాటు ఖ‌రీదైన‌ఫోన్‌ల‌ను బ‌హుమ‌తిగా కూడా ఇస్తున్నట్టు చెబుతున్నారు. ఖైర‌తాబాద్‌లో ఓట‌ర్ల‌కు అక్క‌డి అభ్య‌ర్థులు ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను ఎర‌వేస్తున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇంట్లో ఐదుకుపైగా ఓట్లు ఉంటే చాలు ఫ్రిజ్‌, ఏసీ వ‌చ్చేస్తున్నాయి. కొంద‌రికి మీకు కావాల్సిన ఐటెం తీసుకోండి అంటూ ఓచ‌ర్స్ ఇచ్చేస్తున్నారు. ఇంకొంద‌రికి వారికి కావాల్సిన ఐటెంను ఆన్‌లైన్‌లో బుక్ చేస్తున్నారు. 

ఫ్రిజ్, బీరువా, పోన్ ఇలా ఏదైనా స‌రే కోరుకోండి కొనిపెడ‌తామంటున్నారు.  ఇక మందు, విందు మామూలే. ఎంత తింటే అంత‌.. ఎంత తాగితే అంత‌. దీని కోసం రెండు నెల‌ల ముందే బ్యాంకు ఖాతాల్లో న‌గ‌దు వేసి  రెడీ చేసుకున్నారు. 


 

Comments