తెలంగాణ ఎన్నిక‌ల్లో మ‌రో అరుదైన దృశ్యం..!

trs, telangana, tdp,

తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో నేడు మ‌రో అరుదైన దృశ్యం క‌నిపించ‌బోతోంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీలు నేడు తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చార ప‌ర్వంలో పాల్గొన‌నున్నారు. రాహుల్ గాంధీ ఇప్ప‌టికే రెండు విడ‌త‌ల ప్ర‌చారంలో పాల్గొన‌గా మోడీ రెండు స‌భ‌ల్లో పాల్గొన‌నున్నారు. స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌టంతో ఈ ఇద్ద‌రు త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం నింపేందుకు చివ‌రి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 

రాహుల్ గాంధీ ఇవాళ రెండు ఎన్నిక‌ల స‌భ‌ల్లో పాల్గొంటారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు గ‌ద్వాల్ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడ‌తారు. త‌రువాత తాండూరు స‌భ‌కు హాజ‌ర‌వుతారు. సాయంత్రం చంద్ర‌బాబుతో క‌లిసి రోడ్ షోలో పాల్గొంటారు రాహుల్ గాంధీ.  ఇటీవ‌లో రెండు స‌భ‌ల్లో పాల్గొన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేడు మ‌రోసారి తెలంగాణ‌లో అడుగు పెట్ట‌నున్నారు. హైద‌రాబాద్ ఎల్బీస్టేడియంలో జ‌రిగే భారీ బ‌హిర‌గ స‌భ‌లో మోడీ పాల్గొంటారు. 

రెండు రోజులుగా ప‌లు ప్రాంతాల్లో నిర్వ‌హించిన రోడ్ షోల్లో పాల్గొన్న చంద్ర‌బాబు నాయుడు ఈ రోజు ముషీరాబాద్ ఖైర‌తాబాద్, జూబ్లీహిల్స్,  కూక‌ట్‌ప‌ల్లి, శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో ప్ర‌చారాల్లో పాల్గొంటారు. మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు గ‌గ‌న్ మ‌హ‌ల్ ప్రాంతంలోనూ, త‌రువాత రామ్‌న‌గ‌ర్ క్రాస్ రోడ్డు వ‌ద్ద జ‌రిగితే ప్ర‌చారంలో పాల్గొంటారు. మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు రోడ్డు నెం.12లో రోడ్‌షో నిర్వ‌హిస్తారు. త‌రువాత ఎన్‌బీటీ న‌గ‌ర్‌లో   సభ‌లో మాట్లాడ‌తారు. ఆ త‌రువాత జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ర‌హ్మ‌త్ న‌గ‌ర్‌, ఆ త‌రువాత కూకట్‌ప‌ల్లి, శేరిలింగంప‌ల్లి ప‌రిధి కైక‌లాపూర్‌లో బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌సంగిస్తారు.  

Comments