అమ్మాయిలూ.. మీపై కేసులు పెట్టిస్తాం : ప‌వ‌న్‌

అమ్మాయిలూ.. మీపై కేసులు పెట్టిస్తాం : ప‌వ‌న్‌

అమ్మాయిలూ.. మీపై కేసులు పెట్టిస్తాం : ప‌వ‌న్‌

అమ్మాయిలూ... మీపై కేసులు పెట్టిస్తానంటూ జ‌న‌సేన అధినేత‌, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. కాగా, ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ వ్యాప్తంగా ముమ్మ‌ర ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సాధార‌ణ ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తున్న త‌రుణంలో గెలుపే ల‌క్ష్యం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. 


ఇదిలా ఉండ‌గా, ఇటీవ‌ల ఉభ‌య గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని మాట్లాడారు. ఇదే స‌మ‌యంలో ప‌వ‌ర్ స్టార్‌.. ప‌వ‌ర్ స్టార్ అంటూ కొంత మంది యువ‌తులు నినాదాలు చేస్తుండ‌గా, గ‌మ‌నించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ్మాయిలు మీపై ఈవ్ టీజింగ్ కేసులు పెట్టిస్తా అంటూ ఫ‌న్నీ కామెంట్స్ చేశారు. అబ్బాయిలు చేస్తే ఈవ్ టీజింగ్‌.. అమ్మాయిలు చేస్తే  ఆడ‌మ్ టీజింగ్ అనాలా మ‌నం అంటూ ప‌వ‌న్ అన‌డంతో  స‌భ‌లో పాల్గొన్న వారంద‌రూ ప‌వ‌ర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు.

Comments