ద‌మ్ముంటే నాపై పోటీ చెయ్..?

ద‌మ్ముంటే నాపై పోటీ చెయ్..?

ద‌మ్ముంటే నాపై పోటీ చెయ్..?

ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ మ‌రో సారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి ద‌మ్ము, ధైర్యం ఉంటే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో త‌న‌పై పోటీ చేసి గెల‌వాల‌ని స‌వాల్ విసిరారు. రాహుల్ స‌భ‌ల‌కు, మ‌ద్యం, బిర్యానీ ఇచ్చి త‌ర‌లిస్తున్నార‌ని అస‌దుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఎంఐఎం పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గాల్లో తెరాస‌ను ఓడించాల‌న్న అస‌దుద్దీన్ మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌హాకూట‌మిని చిత్తుగా ఓడించాల‌ని పిలుపునిచ్చారు.

మొన్న‌టి వ‌ర‌కు రాజ‌కీయ బ‌ద్ధ‌శ‌త్రువులుగా ఉన్న కాంగ్రెస్‌, టీడీపీ పార్టీలు తెలంగాణలో ఎన్నిక‌ల‌కు భ‌య‌ప‌డి నిఖా చేసుకున్నారు. వారి క‌ల‌యిక‌ను చ‌రిత్ర క్ష‌మించ‌ద‌ని, అటువంటి వారికి ప్ర‌జ‌లే బుద్ధి చెప్తార‌న్నారు. మ‌హాకూట‌మి ఎన్ని కుట్ర‌లు చేసినా అధికారం చేప‌ట్ట‌డం జ‌ర‌గ‌ద‌న్నారు. ఎంఐఎం అభ్య‌ర్థుల‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కోరారు. 

Comments