బైక్‌ను ఢీకొని ప‌ల్టీలు కొట్టిన కారు..!

బైక్‌ను ఢీకొని ప‌ల్టీలు కొట్టిన కారు..!

బైక్‌ను ఢీకొని ప‌ల్టీలు కొట్టిన కారు..!


హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల ట్యాంక్ బండ్‌పై అర్థ‌రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. యాప్రాల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మాథ్యూ, అశ్విన్‌లు ప్లూటుగా మందుకొట్టి అర్థ‌రాత్రిపూట షికారుకు హిమాయ‌త్‌న‌గ‌ర్ నుంచి ట్యాంక్ బండ్ వైపుగా బ‌య‌ల్దేరారు. కారును మాథ్యూ అతివేగంగా న‌డుపుతూ రెండు బైక్‌ల‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న ఇద్దరికి తీవ్ర గాయాల‌య్యాయి. అంత‌టితో ఆగ‌ని కారు ప‌ల్టీలు కొట్టింది. గాంధీన‌గ‌ర్ పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఇద్ద‌రినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. 

Comments