బాహుబ‌లి -2లో స‌గం కూడా క‌లెక్ట్ చేయ‌ని 2.ఓ..!

rajani kanth, prabhas

బాహుబ‌లి -2లో స‌గం కూడా క‌లెక్ట్ చేయ‌ని 2.ఓ..!

ర‌జ‌నీకాంత్‌కు ఉన్న ఇమేజ్‌తో పోల్చుకుంటే ప్ర‌భాస్ కు ఉన్న క్రేజ్ చాలా త‌క్కువ‌. ర‌జ‌నీకాంత్ ఆలిండియా సూప‌ర్ స్టార్ కావ‌డంతో 2.ఓ సౌత్‌తో మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతుంద‌ని ఎక్స్‌పెక్ట్ చేశారు. అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టించ‌డంతో హిందీలోనూ  భారీ ఓపెనింగ్స్ వ‌స్తాయ‌ని అంచ‌నా వేశారు.  అందుకు త‌గ్గ‌ట్టే హిందీలో మొద‌టి రోజు రూ.20 కోట్లు రాబ‌ట్టినా బాహులితో పోల్చుకుంటే స‌గం కూడా రాలేదు. 

బాహుబ‌లి - 2 ఫ‌స్ట్ డే వ‌సూళ్ల‌ను బ్రేక్ చేసే స‌త్తా థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌కు ఉందంటూ ఆ మ‌ధ్య బాలీవుడ్ మీడియా పేర్కొంది. అమీర్ ఖాన్‌, అమితాబ్ క‌లిసి న‌టించిన థ‌గ్స్ హిందీలో రూ.52 కోట్లు క‌లెక్ట్ చేసి బాహుబ‌లి -2 రికార్డును బ‌ద్ద‌లు కొట్టినా ప్ర‌పంచ వ్యాప్తంగా క‌లెక్ష‌న్స్‌ను దాటలేక‌పోయింది. 

బాహుబ‌లి -2 రిలీజై 18 నెల‌లు దాటింది. చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ వ‌చ్చినా బాహుబ‌లి -2 రికార్డు చెక్కు చెద‌ర‌లేదు. రిలీజైన మొదటి రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా 204 కోట్ల గ్రాస్‌, రూ.121  కోట్ల షేర్‌ను క‌లెక్ట్ చేసింది. ఈ ఫిగ‌ర్ ను అందుకోవ‌డం ఇప్ప‌ట్లో సాధ్య‌మ‌య్యేట్లు క‌నిపించ‌డం లేదు. 

Comments