స‌మంత తాజా ట్వీట్ వైర‌ల్‌..!

samantha

టాలీవుడ్ స‌క్సెస్‌ఫుల్ బ్యూటీ స‌మంత త్వ‌ర‌లో డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నుంది. స‌మంత త‌న కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ ద్విపాత్రాభిన‌యం పోషిస్తోంది. అయితే, ఈ రెండు పాత్ర‌ల మ‌ధ్య వ‌య‌సులో 50 ఏళ్ల తేడా ఉంది. అమ్మమ్మ‌, మ‌న‌వ‌రాలిగా న‌టించాల్సి రావ‌డంతో టెన్ష‌న్ ప‌డుతోంది స‌మంత‌. 

స‌మంత త్వ‌ర‌లో నందినిరెడ్డి డైరెక్ట్ చేసే మూవీలో డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నుంది. అమ్మ‌మ్మ మ‌న‌వ‌రాలిగా ఎలా మారుతుంద‌న్న కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన కొరియ‌న్ మూవీ ఆధారంగా మిస్‌క్రాని ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం. ఈ పాత్ర త‌న కెరీర్‌లో అత్యంత స‌వాల్‌తో కూడుకున్న‌దంటు అంటోంది సామ్స్‌. 

నందినిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ పాత్ర గురించి స‌మంత భారీగానే ట్వీట్ చేసింది. ఇందులో నా క్యారెక్ట‌ర్ గురించి తెలుసుకున్నాక చాలా భ‌య‌ప‌డ్డా, ఇబ్బంది ప‌డ్డా, ఈ స‌వాల్‌ను తీసుకోకుండా ఉండ‌లేను. నా కొత్త ప్ర‌యాణం మొద‌లు అంటూ వృద్ధురాలి పాత్ర గురించి ఇండైరెక్టుగా చెప్పింది స‌మంత‌. ఈ అందాల భామ బామ‌గా ఎలా క‌నిపిస్తుందో చూడాలి.

Comments