మ‌రోసారి హైద‌రాబాద్‌కు చంద్ర‌బాబు

chandrababu

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు రేపు మ‌రో సారి హైద‌రాబాద్‌కు రానున్నారు. హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న త‌మ పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల త‌రుపున దాదాపు ఐదు రోజుల‌పాటు ప్ర‌చారం చేయ‌నున్నారు. 

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా హైద‌రాబాద్ రాజేంద్ర‌న‌గ‌ర్ తెదేపా నుంచి ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీ చేస్తున‌న్ గ‌ణేశ్ గుప్తా, తోపాటు కూక‌ట్‌ప‌ల్లి నుంచి పోటీ చేస్తున్నా దివంగ‌త టీడీపీ నేత హ‌రికృష్ణ కుమార్తె సుహాసిని త‌రుపున ఎన్నిక‌ల ప్ర‌చారం చేయ‌నున్నారు. అలాగే, తెలంగాణ‌లోని మ‌రికొన్ని ప్రాంతాల్లో టీడీపీ అభ్య‌ర్థుల గెలుపుకోసం చంద్ర‌బాబు ముమ్మ‌ర ప‌ర్య‌ట‌న చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

Comments