విహారయాత్ర‌లో విషాదం

Tragedy on vacation

క‌డ‌ప న‌గ‌రంలో విషాదం చోటు చేసుకుంది. న‌గ‌ర శివారులోని జ‌లాశ‌యంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్ద‌రు పిల్ల‌లు గ‌ల్లంత‌య్యారు. పాత‌క‌డ‌ప‌కు చెందిన అక్కా, త‌మ్ముడు త‌న త‌ల్లి రుక్సానాతో క‌లిసి విహార‌యాత్ర‌కు వాటర్ గండికి వెళ్లారు.  అందులో స్నానం చేసేందుకు ఇద్ద‌రు పిల్ల‌లు నీటిలో దిగడంతో మునిగిపోయారు. 

పెన్నాన‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుండ‌టంతో అందులో కొట్టుకుపోయారు. దీంతో త‌ల్లి హుటాహుటిన పోలీసుల‌కు స‌మాచారాన్ని చేర‌వేయ‌డంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది ముమ్మ‌రంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. కావ్య మృత‌దేహం ల‌భ్యం కాగా, బిలాల అహ్మ‌ద్ మృత‌దేహం ఆచూకీ తెలియాల్సి ఉంది. 
 

Comments