బంజారాహిల్స్‌లో డ్ర‌గ్స్ ప‌ట్టివేత‌

Take Drugs in Banjara Hills

హైద‌రాబాద్‌లో మ‌రోసారి డ్ర‌గ్స్ ప‌ట్టివేత క‌ల‌కలం రేపుతోంది.  ప‌క్కా స‌మాచారంతో బంజారాహిల్స్ లో పోలీసులు మాద‌క‌ద్ర‌వ్యాల‌ను ప‌ట్టుకున్నారు. 20 గ్రాముల కొకైన్‌ను విక్ర‌యించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న నైజీరియ‌న్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రెండు సెల్‌ఫోన్‌లు, పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. అయితే, నిందితుడిపై గతంలోనూ రెండు డ్ర‌గ్స్  కేసులు ఉన్న‌ట్టు పోలీసులు చెబుతున్నారు. 

Comments